Ramchandra Rao: ఎక్కడ అన్యాయం జరిగినా దానికి పోరాటమే మార్గమని, ఆ పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంరలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా, గీత కార్మికుల సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాగా రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మొఘల్ సామ్రాజ్యం కాలంలో, తరువాత బ్రిటీష్ పాలనలో దేశంపై ఎన్నో దాడులు జరిగాయని పేర్కొన్నారు.
ఆ డిమాండ్ మేరకు
మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సర్వాయి పాపన్న గౌడ్ వీరుడిగా అవతరించారని కొనియాడారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పెత్తందారీ వ్యవస్థను ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారన్నారు. పాపన్న గౌడ్ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు రాంచందర్ రావు స్పష్టంచేశారు. ఆపై ట్యాంక్ బండ్ వద్ద సైతం పాపన్న గౌడ్ చిత్ర పటానికి రాంచందర్ రావు నివాళులర్పించారు.
Also Read; Trump Putin meeting: ట్రంప్, పుతిన్ భేటీపై కేంద్రం కీలక ప్రకటన
ఘోర విద్యుత్ షాక్ ఘటనలో
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరనం ముచ్చింతల్ లో చిన్న జీయర్ స్వామి ఆశీస్సులను రాంచందర్ రావు తీసుకున్నారు. ఇదిలా ఉండగా రామంతపూర్ గోఖలే నగర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన ఘోర విద్యుత్ షాక్ ఘటనలో మృతిచెందిన కుటుంబాలను రాంచందర్ రావు పరామర్శించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించిన కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్ మృతదేహాలకు నివాళులర్పించారు.
Also Read: Harish Rao: కాళేశ్వరంపై బురద రాజకీయాలొద్దు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు