Satya Dev In Rao Bahadur
ఎంటర్‌టైన్మెంట్

Rao Bahadur Teaser: ‘రావు బహదూర్’ టీజర్.. మాములుగా లేదు

Rao Bahadur Teaser: సత్య దేవ్ (Satya Dev).. చేసిన సినిమాలు తక్కువే అయినా.. వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలన్‌గా చేసి, చిరంజీవినే డామినేట్ చేసేంతగా తన నటనతో చెలరేగిపోయారు. రీసెంట్‌గా వచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమాలోనూ విజయ్ దేవరకొండ అన్నగా ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలై, మంచి ఆదరణనే రాబట్టుకుంటోంది. ఇప్పుడు మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సత్య దేవ్ రెడీ అవుతున్నారు. విశేషం ఏమిటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్.. ఈ సినిమాను ప్రజంట్ చేస్తుండటం. ఇంతకీ ఈ సినిమా పేరు ఏమిటని అనుకుంటున్నారా? ‘రావు బహదూర్’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read- 71st National Film Awards: నేషనల్ అవార్డ్ విన్నర్స్‌ని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏం హామీ ఇచ్చారంటే?

‘కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాలతో.. సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా.. ఇప్పుడు తెలుగు సినిమా బౌండరీలు దాటే ఒక ఎక్సయిటింగ్ సైకాలజిక్ డ్రామాలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతున్నారు. ఎ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ‘రావు బహదూర్’ సినిమా ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన టైటిల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఎస్.ఎస్. రాజమౌళి వదిలిన ‘నాట్ ఈవెన్ ఎ టీజర్’ కూడా మంచి స్పందనను రాబట్టుకుని.. ఓ వైవిధ్యమైన సినిమా రాబోతుందనే హింట్‌‌ని ఇచ్చేసింది. ఈ టీజర్‌ను గమనిస్తే.. (Rao Bahadur film teaser)

జమీందారీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ పాత కోటలో విలక్షమైన అవతార్‌లో ఒంటరిగా జీవిస్తున్న హీరో.. తనకి అనుమానం అనే భూతం పట్టుకుందని నమ్ముతాడు. ఆ అనుమాన భూతమే తన జీవితాన్ని మార్చేస్తుంది. నిజం, భ్రమ మధ్య గీతే తెలియకుండా చేస్తుంది. అతని గతంలో ఒక రహస్యమైన ప్రేమకథ కూడా దాగుందని ఇందులో చూపించారు. ఆ ప్రేమకథలోనూ లోతైన భావోద్వేగాలు, సైకాలజికల్ లేయర్స్ దాగి ఉన్నట్లుగా టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. మరో వైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లైన్ కూడా నడుస్తుండటంతో ఈ కథ ఈజీగా అర్థమవుతోంది. కానీ వాళ్ల ప్రశ్నలతో క్లారిటీ రాకుండా, మిస్టరీ మరింత పెంచేశారు. ఇవన్నీ కేవలం స్టార్ట్ మాత్రమే, ఇక్కడి నుంచి ఇంకా టెర్రిఫిక్ ట్విస్ట్ మొదలవుతుందనేలా టీజర్‌ని కట్ చేసిన తీరు.. సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.

Also Read- DMK – Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇండియా కూటమి వ్యూహం.. అభ్యర్థి ఆయనేనా?

ఇంకా చెప్పాలంటే.. విజువల్ స్టైల్లో ఈ సినిమా ఒక పోయిట్రీలా కనిపిస్తుంది. వెంకటేశ్ మహా మరోసారి తన స్టోరీ టెల్లింగ్‌కి స్పెషల్ మార్క్ వేశారు. డ్రామా, సైకాలజికల్ థ్రిల్, డార్క్ హ్యూమర్.. అన్నీ కూడా థ్రిల్ చేసేలా ఉన్నాయి. హీరో సత్యదేవ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచే చిత్రమనేలా.. తను అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు వేర్వేరు లుక్స్‌లో, వేర్వేరు భావాలతో ఉన్న తన పాత్ర.. తన స్థాయిని మరింతగా పెంచుతుందనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఇంకా వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి వంటి ప్రధాన పాత్రలను కూడా ఈ టీజర్‌లో పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ.. ట్రెండ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల సబ్ టైటిల్స్‌తో 2026 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు