GHMC
తెలంగాణ, హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ శానిటేషన్‌‌లో మరిన్ని సంస్కరణలు

GHMC: ట్రాన్స్‌పోర్టు విభాగంలో త్వరలో మార్పులు

ఫోర్‌మెన్, డ్రైవర్ల బదిలీలకు అవకాశం
అందరీకి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అమలుకు కసరత్తు
మినహాయించాలని ఇప్పటికే పలు యూనియన్ల అభ్యర్థనలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ (GHMC) అందిస్తున్న ముఖ్యమైన సేవల్లో శానిటేషన్ ప్రధానమైనది. అసలే వర్షకాలం కావడంతో నగరం నుంచి ఎప్పటికపుడు చెత్తను తరలించేందుకు, సకాలంలో రోజువారీగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ.. త్వరలోనే ఈ విభాగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇప్పటికే శానిటేషన్ విభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా శానిటరీ జవాన్లకు ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకురాగా, అధికారులు త్వరలోనే ట్రాన్స్ పోర్టు విభాగంలో ఏళ్ల నుంచి తిష్ట వేసిన పలువురు ఫోర్‌మెన్, డ్రైవర్లకు కూడా స్థానచలనం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్‌పోర్టు విభాగంలోని కార్మికులు, డ్రైవర్లు, ఫోర్‌మెన్‌ల వివరాలను ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) అదనపు కమిషనర్ రఘుప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Read Also- Apple Company: కనీవినీ ఎరుగని మొత్తంతో ఓ భవనాన్ని లీజుకు తీసుకున్న యాపిల్

అన్ని సర్కిళ్ల నుంచి డేటా సేకరణ తుది దశలో ఉన్నట్లు, మొత్తం డేటా స్వీకరించిన వెంటనే ట్రాన్స్‌పోర్టు సిబ్బందిని ఒక జోన్ నుంచి మరో జోన్‌కు బదిలీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కానీ, ఇప్పటికే పర్మినెంట్ ఉద్యోగుల్లో కొందరికి ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్‌ను మినహాయించాలని కొన్ని యూనియన్లు ఉన్నతాధికారులకు వినతులను సమర్పించాయి. కానీ, వీటన్నింటిని పక్కన బెట్టి, పర్మినెంట్, ఔట్ సోర్స్ ఉద్యోగులందరికీ ఒకేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అమలు చేసేందుకు అధికారులు మున్ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంచితే, జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగులు హెల్త్, శానిటేషన్ విభాగానికి కేటాయించినా, వారు ఇక్కడ విధులు నిర్వహించకుండా, వేరే సెక్షన్లలో విధులు నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించిన ఉన్నతాధికారులు, వారిని తిరిగి హెల్త్, శానిటేషన్ విభాగానికి రప్పించేలా త్వరలోనే బదిలీలు చేపట్టనున్నట్లు తెలిసింది.

Read Also- Viral Video: స్నానం చేస్తుంటే.. పులి పలకరించింది.. వామ్మో ఈ వీడియో చూశారా?

అవినీతికి సూత్రధారులు వీరేనా?
జీహెచ్ఎంసీలోని చెత్త తరలించే వాహనాలకు మరమ్మతులు చేసే ట్రాన్స్ పోర్టు విభాగంలోని ఫోర్‌మెన్, డ్రైవర్లే ట్రాన్స్‌పోర్టు విభాగంలో అవినీతికి కారకులవుతున్నారన్న విషయాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా వాహనాల మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించినా, వాహనాల మరమ్మతుల్లో ఫోర్‌మెన్లు కొందరు ఇష్టారాజ్యంగా ఇండెంట్లు రాసుకొని, క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కావాడిగూడ, ఇమ్లిబన్, ఖైరతాబాద్ ట్రాన్స్‌పోర్టు యార్డుల్లో కొందరు ఫోర్‌మెన్లు ఏకంగా 30 ఏళ్ల నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి తోడు మరి కొందరు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అపాయింట్‌మెంట్ అయిన చోటనే ఎలాంటి బదిలీలు లేకుండా విధులు నిర్వహిస్తున్న వారి జాబితాను కూడా బదిలీల కోసం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు జీహెచ్ఎంసీలోని కొందరు పర్మినెంట్ డ్రైవర్లు ఆఫీసర్ల వద్ద దాదాపు దశాబ్దం కాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నట్లు, మరి కొందరు ఔట్ సోర్స్ ప్రాతిపదికన నియమితులైన డ్రైవర్లు సైతం సక్రమంగా విధులకు హాజరుకావటం లేదని, మరి కొందరు యూనియన్ కార్యాకలాపాల్లో తిరుగుతూ, విధులు నిర్వర్తించకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు వీరందరికి ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్ ను అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?