Rahul Sipligunj: ఆస్కార్ తో ప్రపంచ వ్యాప్తంగా.. పేరు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాటు నాటు పాటతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందాడు. అయితే, తాజాగా ఈ సింగర్ ఎంగేజ్మెంట్ చేసుకుని బిగ్ షాక్ ఇచ్చాడు.
హరిణి రెడ్డి అనే అమ్మాయితో ఆగస్టు 17, 2025న హైదరాబాద్‌లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, అయితే రాహుల్ ఇంత వరకు దీనికి సంబంధించిన ఫోటోలు అధికారికంగా పోస్ట్ చెయ్యలేదు. అలాగే, అతని కుటుంబం నుంచి ఎలాంటి ఫోటోలు షేర్ చేయలేదు. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ప్రేమ, పెళ్లి అంటూ అనేక రుమార్లు వచ్చాయి. అలాగే, అషూ రెడ్డితో ఎఫైర్ నడిపాడని చాలా మంది అనుకున్నారు. ఇక ఇప్పుడు వాటిలో ఎలాంటి నిజం లేదని ఈ ఎంగేజ్మెంట్ తో చెప్పకనే చెప్పేశాడు. ఎవరికీ తెలియకుండా ఇంత సైలెంట్ గా ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నాడనే సందేహాలు వస్తున్నాయి.
Also Read: Poll Body Boss: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బిగ్ షాక్.. అభిశంసన దిశగా విపక్షాల అడుగులు!
రాహుల్ సిప్లిగంజ్ తెలుగు సినిమా రంగంలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్. ఆయన ‘నాటు నాటు’ (RRR) పాటతో ఆస్కార్ అవార్డు సాధించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అతను పాడిన పాటలలో కొన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం..
నాటు నాటు (Naatu Naatu) RRR (2022)ఈ పాట ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ పాటగా చరిత్ర సృష్టించింది. ఎనర్జిటిక్ బీట్స్, తెలంగాణ స్లాంగ్‌తో ఈ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఓమై గాడ్ డాడీ – అల వైకుంఠపురములో ఈ ఫాస్ట్-బీట్ పాట యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. రాహుల్ ఎనర్జీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: Swetcha Special story: కోట్ల విలువ చేసే భూములు హాం ఫట్.. విచ్చల విడిగా అనుమతులిచ్చిన అధికారులు!
బొంబాట్ (Bombhaat) – లై (2017) ఫన్ ట్రాక్‌లో రాహుల్ హైదరాబాదీ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది.
పెద్ద పులి (Pedda Puli) – చల్ మోహన్ రంగ (2018) సినిమాలోని పెద్ద పులి పాట వెర్సటైల్ సింగింగ్‌ను చాటింది.
