Mahesh Kumar Goud ( IMAGE credit: swetcha reporter)
Politics

Mahesh Kumar Goud: వారి అండతోనే ప్రజా ప్రభుత్వం.. పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: ఎస్సీ, ఎస్టీ, బీసీల అండతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు.  ఆయన హైదరాబాద్‌(Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో భాగం లేని వాళ్ళు, ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్నారన్నారు. మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ శక్తుల నుంచి రాజ్యాంగా(Constitutiona)న్ని కాపాడుకోవాలంటే మనమందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు.

 Also Read: Collectorate: కలెక్టరేట్లో కామాంధుడు…? మద్యం సేవించి.. ఓ చిన్నారి పై?

రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆశయమైన ఎవరు ఎంతో వారికి అంత వాటా అనే నినాదాన్ని సఫలం చేసిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని కొనియాడారు. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు చట్టాలను తీసుకొచ్చి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. దేశ రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మతవాద శక్తులను అడ్డుకోవాలన్నారు. అనంతరం తెలంగాణ గంగ తెప్పోత్సవ ఉత్సవ కమిటీ కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దత్తన్నను చూడగానే పార్టీలు మరిచిపోతానని చెప్పారు. దత్తన్న నిజమాబాద్ వచ్చినప్పుడు సైకిల్ మీద కూర్చో బెట్టుకొని వెళ్లిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు. కులం ఏదైనా, కుల వృత్తులు శాశ్వతంగా ఉండాలన్నారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత ఎత్తుకు ఎదిగిన కులవృత్తులను మరువకూడదని స్పష్టం చేశారు.

 Also Read: Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?

Just In

01

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Telangana: ‘దూపదీప నైవేథ్యం’ స్కీమ్‌.. ఆలయాల నుంచి భారీగా దరఖాస్తులు.. అధికారుల మల్లగుల్లాలు!

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్.. వీడియో వైరల్