Teenmar-Mallanna
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Teenmaar Mallanna: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Teenmaar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తనకు ఎలాంటి విబేధాలు లేవని పునరుద్ఘాటించారు. ఆమె బీసీ కాదని, బీసీ నినాదంతో ఆమెకేం సంబంధమని ప్రశ్నించారు. రాజకీయంగా బీసీలను అగ్రవర్ణాలు అణగ దొక్కుతున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఐక్యత చాటాలని ఆయన పిలుపునిచ్చారు. నామినేషన్లు వేయడానికి కూడా అగ్రవర్ణాలు భయపడాలని, అగ్రవర్ణాలను రాజకీయ సమాధి చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బీసీలం ఒక్కటయ్యామని, ఒక్కటిగానే పొరాడతామని తీన్మార్ మల్లన్న అన్నారు. ‘‘2028లో మా ఓట్లు.. మా సీట్లు నినాదంతో ముందుకెళ్తాం. బీసీలదే రాజ్యాధికారం’’ అని అన్నారు. ఈ మేరకు నిజామాబాద్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Read Also- Election Commission: రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కీలక ప్రెస్‌మీట్

కాంగ్రెస్‌ది నాటకం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ నాటకమని తీన్మార్ మల్లన్న కొట్టిపారేశారు. ‘‘42 శాతం బీసీల రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. రిజర్వేషన్లు సాధిస్తే రాజీనామా చేస్తా. బీసీలకు మించిన రాజకీయ శక్తి లేదు. నా వెనక ఉన్నది బీసీ ప్రజలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నారు.

Read Also- Congress: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌‌లో వరుస రాజీనామాలు.. కారణాలు ఇవే

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?