Rashmika – Vijay: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ల రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియని విషయం అయితే కాదు. వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ధృవీకరించలేదు కానీ, ఆ వార్తలకు బలం చేకూర్చేలా వారిద్దరూ కలిసి కనిపించడం, వారిద్దరూ తరచుగా కలిసి వెకేషన్‌లకు వెళ్లడం, విమానాశ్రయాల్లో కలిసి కనిపించడం, ఒకే ఇంట్లో ఉన్నట్లు సూచించే చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి వాటితో వారి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతుందనే వార్తలు అస్సలు ఆగడం లేదు.
ఇంకా వారిద్దరూ పరోక్షంగా స్పందించడం కూడా ఆ వార్తలకు బలాన్ని ఇచ్చినట్లవుతుంది. వారిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి నేరుగా చెప్పకపోయినా, పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఒక సందర్భంలో, విజయ్ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెబితే, రష్మిక తన జీవితంలో ఒక ‘పార్టనర్’ ఉన్నారని, ఆ వ్యక్తి తన కష్టసమయాల్లో అండగా ఉంటారని తెలిపింది. అలాగే రష్మిక మందన్నా.. విజయ్ కుటుంబ సభ్యులతో చాలా సన్నిహితంగా ఉండటం కూడా ఓ కారణం. గతంలో విజయ్ ఇంట్లో రష్మిక ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందుకే వారిద్దరిపై వార్తలు ఆపనంత వేగంగా వైరల్ అవుతూనే ఉన్నాయి.
Also Read- Niharika: విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక ఎవరితో చిల్ అవుతుందో చూశారా? ఫొటోలు వైరల్!
మొదట వీరిద్దరినీ కలిపింది మాత్రం ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమానే అని అందరికీ తెలిసిందే. ఆ సినిమా టైమ్‌లోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలైందని, అది చాలా దూరం వెళ్లిందని, అతి త్వరలో ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలా ఇప్పటికే వార్తలు టామ్ టామ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి లిప్ లాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో ‘గీత గోవిందం’ సినిమాకు సంబంధించినదేనని, అన్ సీన్ వీడియో అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఇద్దరి మధ్య డీప్ లిప్ లాక్ సీన్ ఉంది. మొదట కిస్ పెట్టినందుకు విజయ్‌ని దూరం పెట్టిన రష్మిక, తన గురించి తెలిసిన తర్వాత.. మారిపోతుంది.
చివరిలో పెళ్లి అనంతరం.. ఎక్కడయితే విజయ్‌ని తను ధ్వేషించిందో.. అదే చోట విజయ్‌కి లిప్ లాక్ పెడుతుంది. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రస్తుతం ‘గీత గోవిందం’ సినిమా విడుదలై 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వీడియో వైరల్ అవుతుండటం విశేషం. ఇదిలా ఉండే ఈ సినిమా తర్వాత విజయ్ చేసిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. ఇప్పుడు విజయ్ చేయబోయే ఓ సినిమాలో కూడా రష్మిక మందన్నానే హీరోయిన్ అనేలా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత ఇద్దరి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన మ్యాటర్ బయటికి వస్తుందనేలా టాక్ వినిపిస్తుంది. చూద్దాం.. వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడు బయటపెడతారో..!
Deleted scene from Geetha Govindham #7YearsForGeethaGovindam pic.twitter.com/wQNgcAZg3X
— Jack (@MrRuturaja173) August 15, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
