T.graduate mlc election poling
Politics

Telangana:మొదలైన ‘పట్టభద్రుల’ పోలింగ్

Nalgonda Khammam Warangal graduate mlc election poling started :
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సోమవారం ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లారాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పోలీసుల విస్తృత తనిఖీలు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది.మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73, 406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బిజెపి నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తో పాటు 49 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో విశేషంగా ప్రచారం చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రారంభం పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 8 గంటలకే ఓటర్లు బారులు తీరారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్టతో పాటు మరికొన్ని అత్యవసర మందులను సైతం ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం వేళ వచ్చే ఓటర్లకు ఎండ ఇబ్బంది లేకుండా షామియానాలు వేయించారు. సెల్ ఫోన్ తో ఎవరూ కూడా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఉండే విధంగా ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా సహాయకుల కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలను దృష్టి లో పెట్టుకుని పోలింగ్ కేంద్రం వద్ద ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?