People Media Factory
ఎంటర్‌టైన్మెంట్

People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డేరింగ్ స్టెప్.. మ్యాటర్ మొత్తం రిలీజ్ చేశారు

People Media Factory: టాలీవుడ్‌లో అగ్రగామి సంస్థగా దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై.. ఈ మధ్యకాలంలో భారీగా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సంస్థలో పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని, అందుకే సినిమాల షూటింగ్స్ ఆగిపోతున్నాయనేలా టాక్ నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న ‘మిరాయ్’ సినిమా ఆలస్యానికి కారణం కూడా ఇదేనని అంతా అనుకుంటూ ఉన్నారు. ఇవే కాదు, ఇంకా చాలానే ఆరోపణలు ఈ బ్యానర్‌పై వస్తున్న తరుణంలో సదరు నిర్మాత సంస్థ.. సీరియస్ అవుతూ.. ఇలాంటి ఆరోపణలు మళ్లీ మళ్లీ తమ సంస్థపై రాకుండా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది.

Also Read- Niharika: విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక ఎవరితో చిల్ అవుతుందో చూశారా? ఫొటోలు వైరల్!

ఈ బ్యానర్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ఈ బ్యానర్‌లో చేసిన కార్మికులకు ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ చెల్లించింది తెలుపుతూ.. ఓ షీట్‌ను విడుదల చేశారు. ఆ షీట్‌తో పాటు ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయో కూడా వివరంగా తెలిపారు. వాస్తవానికి టీజీ విశ్వప్రసాద్ ఉన్న స్టేజ్‌కు ఇవన్నీ అవసరం లేదు. కానీ కొన్ని ఆరోపణలు చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుండటంతో.. ఎక్కడ వారి బ్యానర్ రెప్యూటేషన్ దెబ్బతింటుందో అని.. మళ్లీ ఎవరూ నోరెత్తి మాట్లాడకుండా, మాట్లాడిన వారందరికీ ఇచ్చి పడేశారు. ఎవరెవరికి ఎంతెంత చెల్లించారనే వివరాలతో పాటు.. ఓ లేఖను కూడా జత చేశారు. అందులో..

Also Read- Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’.. ‘ఫైటర్ శివ’ టీజర్ అరాచకం

‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గత 12 నెలల్లో BTL/production activities లో పనిచేసిన రోజువారీ కూలీలకు సుమారు రూ. 60 కోట్లు చెల్లించింది. అదనంగా, జూలైలో జరిగిన షెడ్యూళ్లకు సంబంధించిన సుమారు రూ. 1 కోటి బకాయిలు ఉన్నాయి.
ఈ రూ. 60 కోట్లలో కంపెనీ ఉద్యోగుల నెలసరి వేతనాలు (వివిధ crafts లో పని చేసే వారు), అంటే మరో రూ. 30 కోట్లు, కలిపి లేవు. వీరి వేతనాలు పూర్తిగా చెల్లింపులు అయ్యాయి.
అదేవిధంగా, ఈ మొత్తంలో ATL, key technicians, artists, vendors, VFX టీమ్స్ మరియు location-related ఖర్చులు కూడా ఇవ్వలేదు.
అందువల్ల సంబంధం లేని వ్యక్తులు లేదా తమను తాము యూనియన్ నేతలుగా ప్రకటించుకునే వారు ఈ అంతర్గత చెల్లింపులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తప్పు మరియు అనవసరం. People Media Factory కు ఏ యూనియన్లతో ఒప్పందాలు లేదా బకాయిలు లేవు.
అయితే, PMF జూలై షెడ్యూల్స్‌కు సంబంధించిన కొన్ని బకాయిలు ఉన్నాయని అంగీకరిస్తోంది. అలాగే వాటిని వచ్చే వారం లోపల చెల్లిస్తామని హామీ ఇస్తోంది. ఈ స్వల్ప ఆలస్యం గత రెండు వారాలుగా కార్మికులు అందుబాటులో లేకపోవడమే కారణం.
పూర్తి పారదర్శకత కోసం మరియు గతంలో జరిగిన మధ్యవర్తుల ద్వారా చెల్లింపుల దుర్వినియోగాన్ని నివారించడానికి, ఇకపై ప్రతి చెల్లింపు నేరుగా కార్మికుల ఖాతాలోనే జమ అవుతుంది. PMF ఇకపై మధ్యవర్తుల ద్వారా ఎలాంటి చెల్లింపులు జరపదు.

జూలై షెడ్యూల్ లో బకాయిలు ఉన్న వారు:
తమ అభ్యర్థనలు సమర్పించి, సరైన బ్యాంక్ వివరాలతో enrollment ప్రాసెస్ పూర్తి చేయాలి.
ఈ సమాచారం సంబంధిత Executive Producers (EPs) కు సోమవారం లోపు అందించాలి.
ధృవీకరణ తర్వాత, చెల్లింపులు శుక్రవారం నాటికి జారీ అవుతాయి.
PMF తన జట్ల సహకారాన్ని అభినందిస్తోంది, అలాగే అందరితో తిరిగి పనిచేయడానికి ఎదురుచూస్తోంది.’’ అని పేర్కొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు