Ganja Seized
తెలంగాణ

Ganja Seized: కారు ప్రమాదంలో బయటపడ్డ 20 కిలోల గంజాయి ప్యాకెట్లు.. ముఠా గుట్టురట్టు

Ganja Seized: కారు ప్రమాదం చోటు చేసుకోవడంతో.. కారులో గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్​ మండలం బాటసింగారం ప్రాంతంలో టీఎస్​26 డీ 1004 నెంబర్​ గల కారు డివైడర్​‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైనట్లుగా స్థానికులు పోలీస్​ పెట్రోలింగ్ వాహనానికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. కారు డ్రైవర్​ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించి.. కారును పూర్తిస్థాయిలో పరిశీలించారు. కాగా అందులో మద్యం బాటిల్స్​, గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌ (Abdullapurmet police station)కు ​ తరలించారు.

Also Read- Jagapati Babu: చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు.. అఖిల్ పెళ్లిలో అసలు తాగానా? నాగ్‌ని ప్రశ్నించిన జగ్గూ భాయ్

కారు డ్రైవర్​ భూక్య మధు మహబూబాబాద్ జిల్లా, పుల్లూరు మండలం, బీఆర్​ఎం తండా గ్రామానికి చెందినట్లు గుర్తించారు. మధుకు ఖమ్మం జిల్లా, ఎన్టీఆర్​ సర్కిల్​‌కు చెందిన సాదిబ్​ అనే స్నేహితుడు ఉన్నాడు. కాగా సాదిబ్ సూచన మేరకు గంజాయి తరలించే ఒప్పందానికి మధు ఒప్పుకున్నాడు. ఒడిషా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు గంజాయిని సొంతంగా తరలిస్తే ఎక్కువ డబ్బులు పొందవచ్చని మధుకు ఆశ చూపించి ఒప్పించాడు. కాగా గంజాయి రవాణాకు మధు అంగీకరించడంతో సాదిబ్​​ రూ. 50 వేలు ఇచ్చి.. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్​, రాజమండ్రిలోని గోకవరంకు వెళ్లి అక్కడ ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి మరో రూ. 45 వేలు ఇచ్చి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేశాడు.

Also Read- Free Engineering Education: 100 మంది పేద విద్యార్థులను సొంత ఖర్చులతో బీటెక్ చదివిస్తాను.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కాగా మధు దారి ఖర్చుల కోసం రూ. 5 వేలు తన దగ్గరనే ఉంచుకున్నాడు. ఈ నెల 14న రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లా ఖానాపురం వచ్చి.. ఈ నెల 15న హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్​‌కు వెళ్లే క్రమంలో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్​ మండలం బాటసింగారం వద్ద డివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడే ఆ కారులో ఉన్న గంజాయి బాగోతం బయటపడింది. రాజమండ్రిలో గంజాయి అప్పజెప్పిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన సాదిబ్, కారు డ్రైవర్ మధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్​‌స్పెక్టర్ వి. అశోక్​ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం (Ganja Seized) చేసుకొన్నామని, అతడిని కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

RTA Corruptiont: వరంగల్ మినహా.. రాష్ట్ర మంతా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు

BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ డబ్బులు పంచుతోంది.. ఈసీ పట్టించుకోవట్లేదు.. హరీశ్ రావు ఫైర్

Cyber Security: తెలియని లింక్‌ల నుంచి APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

Thorrur SC Boys Hostel: తొర్రూరు ఎస్సీ హాస్టల్‌లో వసతుల కొరత.. విద్యార్థుల అవస్థలు