rudri-kannada-film( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Kannada Crime Thriller: ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రాత్రివేళల్లో మాత్రం చూడకండి.. లేదంటే అంతే!

Kannada Crime Thriller: ఒక అమ్మాయి నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన కన్నడ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఒక అమ్మాయి రివేంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై ఈ స్టోరీ మొత్తం నడుస్తోంది. ఈ సినిమా టాగోర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 13 అవార్డులు గెలుచుకుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో స్టఫ్ ఏ రేంజులో ఉందో. ఉత్తర కర్ణాటకలో జరిగే ఈ స్టోరీ వీక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఇది ఏం సినిమా? కథ ఏమిటి ? అనేవి తెలుసుకోవాలంటే..

Read also- Cine Workers Strike: 13వ రోజుకు సినీ కార్మికుల సమ్మె.. సంధి కోసం జరుగుతున్న చర్చలు

కథేంటంటే..

ఉత్తర కర్ణాటకలో ఉన్న ఓ చిన్న గ్రామంలో, రుద్రి అనే ఒక యువతి ఆమె అమ్మమ్మతో కలిసి జీవిస్తుంటుంది. ఆమె ఒక టీ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. గ్రామస్తులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ అందరితో మంచి పిల్లగా పేరు తెచ్చుకుంటుంది. పిల్లలతో ఆడుకుంటూ పెద్దలతో మర్యాద పూర్వకంగా మెలుగుతూ ఎంతో ఆనందంగా ఉంటుంది. నలుగురు దుర్మార్గులు ఆమెపై దారుణంగా అఘాయిత్యానికి ఒడిగడతారు. దీంతో ఆమె జీవితం చిన్నాభిన్నం అవుతుంది. ఈ దుర్ఘటన రుద్రిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. ఆమెలో ఒక మానని గాయాన్ని మిగులుస్తుంది. ఆ తరువాత సమాజం నుండి ఇబ్బందులు ఎదుర్కొన్న రుద్రి, తనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలనే నిశ్చయంతో ఒక ప్రతీకార పథకాన్ని రూపొందిస్తుంది.

ఇక రుద్రి ప్రతీకార యాత్ర మొదలవుతుంది. ఆమె తనపై దాడి చేసినవారిని ఒక్కొక్కరినీ గుర్తిస్తూ చంపుతుంటుంది. ఒక స్థానిక పోలీసు అధికారి ఈ హత్యలను దర్యాప్తు చేస్తూ, రుద్రి గాజుల ఆధారంగా ఆమెను గుర్తిస్తాడు. అయితే రుద్రి గతం, ఆమె పడ్డ నరకం గురించి తెలుసుకున్న తర్వాత, అతను ఆమెను అరెస్టు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఆమె పోరాటాన్ని ఒక నైతిక విజయంగా భావిస్తాడు. క్లైమాక్స్ ఒక ఎమోషనల్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ ట్విస్ట్‌ ఏమిటి ? రుద్రి ఆ దుర్మార్గులపై ప్రతీకారం ఎలా తీర్చుకుంది ? అనే విషయాలను ఈ కన్నడ క్రైమ్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read also- Centre on GST: దీపావళి బొనాంజా ఫిక్స్.. ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు.. భారీగా తగ్గనున్న ధరలు!

ఎక్కడ చూడాలంటే..

‘రుద్రి’ (Rudri) అనేది ఉత్తర కర్ణాటక గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఒక కన్నడ క్రైమ్ చిత్రం. బడిగేర్ దేవేంద్ర దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో పావన గౌడ, సుధా ప్రసన్న, హరీష్ కట్టిమని, గురునాథ్ చింతామణి, పవన్ పుత్ర, సమీర్ నాగరాద్, దయానంద్ సాగర్ నటించారు. ఈ చిత్రం 2023 నవంబర్ 10న నమ్మ ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై, IMDbలో 5.1/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?