RGV – Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో కింగ్ నాగార్జునతో చేసిన ‘శివ’ (Shiva) చిత్రంతో అద్భుతమైన గుర్తింపును సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఆయన మేకింగ్ స్టైల్, రియలిస్టిక్ టేకింగ్, కొత్తదనం అనేవి ఆయనకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాయి. ‘శివ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా మారిన వర్మ, తర్వాత కూడా తనదైన శైలిలో అనేక సంచలన చిత్రాలను రూపొందించారు. ఆయన వద్ద పనిచేసిన ఎంతోమంది ప్రస్తుతం అగ్ర దర్శకులుగా మారడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన కొన్ని నాసిరకం సినిమాలు, ఆయన వేలు పెట్టిన కాంట్రవర్సీలు.. ఆయన నేమ్‌ని కాస్త తగ్గించినా, ఆయన క్రియేటివిటీకి ఉన్న ఫ్యాన్స్‌లో మాత్రం ఏం మార్పు లేదంటే నమ్మాలి.
ఇక విషయంలోకి వస్తే.. ‘శివ’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అశ్వనీ దత్ ఓ చిత్రం చేయడానికి పూనుకున్నారు. కానీ, ఆ సినిమా కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది. అందుకు కారణం ఏంటనేది ఇప్పటి వరకు రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై వర్మ క్లారిటీ ఇచ్చారు.
Also Read- Shwetha Menon: ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా శ్వేతా మేనన్ విక్టరీ.. ప్రత్యర్థి ఎవరో తెలుసా?
రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో చేయాలనుకున్న సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని స్పష్టం చేశారు. చిరంజీవి తన స్క్రిప్ట్‌లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, అవన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని వర్మ తెలిపారు. వాస్తవానికి, ఆ సినిమా ఆగిపోవడానికి కారణం చిరంజీవి కాదు, తానేనని వర్మ అంగీకరించారు. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి తనకు ఒక ఆఫర్ రావడంతో, ముంబైకి వెళ్ళిపోవాల్సి వచ్చిందని, అందుకే చిరంజీవితో ప్రాజెక్ట్ వాయిదా పడిందని చెప్పారు.
ఆ తర్వాత నేను అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ని వదిలేసి వెళ్లిపోవడంతో చిరంజీవి హర్ట్ అయ్యారని, అలా ఇక ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని వర్మ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ తన తప్పును ఒప్పుకోవడం పట్ల నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. నిజాయితీగా తన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read- Mahavatar Narasimha: ఆ నిర్మాతకు కాసులు కురిపిస్తున్న కన్నడ ఫిలిం.. లాభం ఎంతంటే?
రామ్ గోపాల్ వర్మ తన కెరీర్‌లో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోతో ‘సర్కార్’ వంటి విజయవంతమైన చిత్రాలు చేసి, బాలీవుడ్‌లో కూడా తన ముద్ర వేశారు. ప్రస్తుతం, ఆయన ఒక భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే దాని గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఈ సినిమాలో అమితాబ్ లాంటి అగ్ర నటులు ఉండబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ మేకింగ్‌కు ఇప్పటికీ చాలామంది అభిమానులు ఉన్నారు, ఆయనతో పనిచేయడానికి చాలామంది నటులు ఆసక్తి చూపిస్తుంటారనే విషయం తెలియంది కాదు. మరోవైపు వర్మకు మంచి పేరు తెచ్చిన ‘శివ’ చిత్రాన్ని అత్యాధునిక హంగులతో రీ రిలీజ్ చేయడానికి కింగ్ నాగార్జున ప్లాన్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు