teja( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Teja new movie: డైరెక్టర్ తేజ కొత్త సినిమా.. హీరో ఎవరంటే?

Teja New Movie: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు తేజ మరో కొత్త ప్రాజెక్టుతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన తన కొడుకును హీరోగా, ఘట్టమనేని రమేష్ బాబు కుమార్తె భారతిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ కొత్త సినిమాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే తేజ గతంలో అనేక మంది కొత్త నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన చరిత్ర ఉంది. ఈ కొత్త చిత్రం ద్వారా మరోసారి ఆయన తనదైన స్టైల్‌లో యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నారు.

Read also- Ponguleti Srinivas Reddy: తెలంగాణ సమాజానికి మహిళలే పునాది.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

తేజ టాలీవుడ్‌లో ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’ వంటి చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఈ చిత్రాలు యువతను ఆకట్టుకోవడమే కాకుండా కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించాయి. ఉదయ్ కిరణ్, నితిన్, కాజల్ అగర్వాల్, రీమా సేన్ వంటి నటీనటులను ఆయన సినీ రంగానికి పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో, తన కొడుకు అమితవ్ తేజను హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. అమితవ్ విదేశాల్లో సినిమాకు సంబంధించిన కోర్సులు చేసి, సినీ రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. తేజ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కానీ ఈ సినిమాను తానే డైరెక్ట్ చేయాలా లేక వేరొకరికి అప్పగించాలా అనే విషయంపై అప్పట్లో స్పష్టత లేదని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను ఆయనే నడిపిస్తున్నట్లు సమాచారం.

Read also- Banakacherla project: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్?

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఘట్టమనేని రమేష్ బాబు కుమార్తె భారతి ఎంట్రీ ఇస్తోంది. ఘట్టమనేని కుటుంబం టాలీవుడ్‌లో ప్రముఖమైనది, రమేష్ బాబు కొడుకు జయకృష్ణను కూడా తేజ గతంలో ‘అర్జున’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. ఇప్పుడు భారతి కూడా ఈ చిత్రం ద్వారా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రానికి ‘వాయువు’ అనే టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ టాక్. తన కొడుకు మొదటి సినిమాకి తానే దర్శకత్వం వహిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆనంది ఆర్ట్స్‌తో కలిసి తేజ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ కొత్త జంటతో తేజ తనదైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది యువ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అవుతోంది. తేజ గత చిత్రాల్లో చూపిన స్టైలిష్ డైరెక్షన్, ఎమోషనల్ డెప్త్ యూత్‌ఫుల్ నరేషన్ ఈ సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉంది.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ