Rachander Rao ( IMAGE credit: swetcha reporter OR TWITTER)
Politics

Ramchander Rao: ఎన్నో స్కాములు చేసిన కాంగ్రెస్.. ఓట్ల చోరీ అంటే నమ్మేదెవరు?

Ramchander Rao: ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ తోక పార్టీగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Rachander Rao) విమర్శలు చేశారు. నాంపల్లి (Nampally) బీజేపీ (Bjp) రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడతూ, కాంగ్రెస్ (Congress) ఇలానే వ్యవహరిస్తే వెంట్రుక పార్టీగా మారుతుందని చురకలంటించారు. 12 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి మోదీ రికార్డు సృష్టించారన్నారు.

 Also Read: Social Service Organisations: గతంలో గుర్తింపు ప్రోత్సాహకాలు.. మరి ఇప్పుడు ఏది..?

భారత్ ఎక్కడ విశ్వగురువు స్థానంలో నిలుస్తుందోననే భయంతో కొన్ని దేశాలు సుంకాలు వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. స్వదేశీ వస్తువుల నినాదంతో ముందుకు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. యుద్ధ విమానాలు, రక్షణ ఆయుధాలు దేశంలోనే తయారు చేసుకుంటున్నామన్నారు. గతంలో వేరే దేశాలను మనం భిక్షం ఎత్తుకునే పరిస్థితి ఉండేదని రాంచందర్ రావు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఇతర దేశాలకు భారత్ చేయూత అందిస్తున్న పరిస్థితికి వచ్చిందని కొనియాడారు. యంగ్ ఇండియా నిర్మాణం చేయాలని ప్రధాని మోదీ ఆలోచన అని వ్యాఖ్యానించారు.

కొన్ని రాజకీయ పార్టీలు దేశాన్ని అవమానించేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ (Brs) సర్జికల్ స్ట్రైక్ జరగలేదంటూ సైనికులను అవమానించారని ఫైరయ్యారు. ఇలాంటి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రనికి రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ (Brs)కు రాజ్యాంగంపై నమ్మకం లేదని, అవి కుటుంబ పార్టీలని విమర్శలు చేశారు. ఎన్నో స్కాములు చేసిన కాంగ్రెస్ (Congress) నేతలు ఇప్పుడు ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్నారని రాంచందర్ రావు (Ramchander Rao) ఫైరయ్యారు. వాళ్లు గెలిచిన చోట ఈవీఎంలు సరిగ్గా పని చేశాయని, వారు ఓడిన చోట మాత్రం పని చేయలేదా అంటూ ఆయన చురకలంటించారు.

 Also Read: Atal Canteen: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఇక రూ.5కే ఆహారం.. రూ.100 కోట్లు కేటాయింపు!

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..