Rajinikanth - PM Modi
ఎంటర్‌టైన్మెంట్

Rajinikanth – PM Modi: రజనీకాంత్‌పై మోడీ ట్వీట్.. ‘కూలీ’కి మాములు బూస్ట్ కాదిది!

Rajinikanth – PM Modi: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ స్వర్ణోత్సవ వేడుకల సమయంలో ఆయన నుంచి వస్తున్న ‘కూలీ’ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ‘కూలీ’ సినిమా మిశ్రమ స్పందన రాబట్టుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘వార్ 2’ సినిమాను అధిగమించి కలెక్షన్లు రాబడుతూ.. బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు రజనీకాంత్.

Also Read- Free Engineering Education: 100 మంది పేద విద్యార్థులను సొంత ఖర్చులతో బీటెక్ చదివిస్తాను.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఇక ఇప్పుడు రజనీకాంత్‌కు ప్రధాని మోడీ చెప్పిన శుభాకాంక్షలతో.. సూపర్ స్టార్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దేశం మొత్తం రజనీ గురించి తెలుసుకునేలా మోదీ పోస్ట్ ఉండటంతో.. ఇది ‘కూలీ’ సినిమాకు మాములు బూస్ట్ కాదని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు రజనీకాంత్ పేరు కొట్టగానే కూలీ టైటిల్ కూడా వస్తుంది కాబట్టి.. ఈ సినిమాపై అందరి దృష్టి పడుతుందని రజనీకాంత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ‘‘థిరు రజనీకాంత్ జీ.. సినీ ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు. మీ ప్రయాణం ఎంతో విశిష్టమైనది. తరతరాల ప్రజల మనస్సులపై మీ వైవిధ్యమైన పాత్రలు చెరగని ముద్ర వేశాయి. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని మోడీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read- MP Raghunandan Rao: 71 వేల ఫేక్ ఓట్లు.. బీహార్ ఓటమిని ముందే ఒప్పుకున్నారు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు

ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఎందరో రియాక్ట్ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. పీఎం చేసిన ఈ పోస్ట్‌తో ‘కూలీ’ కలెక్షన్లలో భారీ ఛేంజ్ రావడం పక్కా అనేలా టాక్ మొదలైంది. ‘కూలీ’ విషయానికి వస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించారు. మరో స్టార్ హీరో ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సౌబీన్ షాహిర్‌ వంటి వారంతా ఇతర కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మరో వైపు రజనీకాంత్ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని సహ నటుడు కమల్ హాసన్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. లోకేష్, అనిరుధ్, ఖుష్భూ, ఉదయనిధి స్టాలిన్ వంటి వారంతా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?