YTD Board (imagecredit:twitter)
తెలంగాణ

YTD Board :ఆధ్యాత్మికత వారికి బోర్డులో అవకాశం.. సీఎం వద్దకు ఫైల్!

YTD Board: వైటీడీ బోర్డుపై క్లారిటీ రానుంది. సీఎం గ్రీన్ సిగ్నలే ఇక తరువాయి. ఈ బోర్డులో ప్రభుత్వమే సభ్యులను నామినేటెడ్ చేయబోతున్నట్లు సమాచారం. చైర్మన్ , మరో 9మంది సభ్యులు ఈ బోర్డులో ఉంటారని, దేవాదాయశాఖ అధికారులకు సైతం ఈ బోర్డులో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఆలయ పౌండర్ ట్రస్టీకి ఈ బోర్డు సభ్యుడిగా నియమిస్తున్నట్లు తెలిసింది.

అధికారులు ప్రభుత్వానికి నివేదిక

ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైటీడీ బోర్డు(YTD Board)కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుందని, బోర్డు చైర్మన్ తో పాటు సభ్యులకు కేవలం టీఏ(TA), డీఏ(DA)లు మాత్రమే ఇవ్వబడతాయని ఆ బోర్డు బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే బోర్డుపై తీవ్ర కసరత్తు చేసిన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బోర్డుకు సంబంధించిన విధివిధానాలు, ఎంతమంది సభ్యులు, చైర్మన్ నియామకం, అధికారులకు స్థానం కల్పన, బోర్డుతో చేయబోయే కార్యక్రమాలు, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ప్రయోజనాలు తదితర అంశాలను ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ((CM REvanth Reddy)) వద్దకు ఫైల్ వెళ్లినట్లు సమాచారం. ఇక ఆమోదమే తరువాయి. ఆ వెంటనే బోర్డుకమిటీ కొలువు దీరనున్నట్లు సమాచారం.

అర్చక స్థానాచర్యకు సైతం

బోర్డులో స్థానిక ఎమ్మెల్యేలకు కల్పించనున్నట్లు సమాచారం. అంతేగాకుండా బోర్డు సభ్యుల్లో ఎస్సీ(SC), బీసీ(BC), మహిళలకు చోటు కల్పిస్తున్నారు. ఆలయంలో పనిచేసే అర్చక స్థానాచర్యకు సైతం అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనర్, యాదాద్రి ఆలయ ఈఓ, వైటీడీఏ వైస్ చైర్మన్, ఫౌండర్ ట్రస్టీలను చేర్చినట్లుగా తెలిసింది. అయితే చైర్మన్, సభ్యులను మాత్రం ప్రభుత్వమే నామినేటెడ్ చేస్తుంది. మరోవైపు ఆధ్మాతికత ఉన్నవారికి సైతం బోర్డులో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Mahabubabad district: వానొస్తే 11 గ్రామాల రాకపోకలు బంద్.. ఈ సారైనా గోస తీరేనా..?

స్వతంత్ర ప్రతిపత్తి కలిపిస్తే

వైటీడీ బోర్డులో ఎలాంటి రాజకీయ ప్రమోయం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిపిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. టీటీడీ(TTD) మాదిరిగా వైటీడీ(YTD)కి మార్గదర్శకాలు రూపొందించినప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పుడే ఆలయానికి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తుందని, ఆలయ అభివృద్ధి జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ప్రభుత్వంపై ఒత్తిడి

ఇప్పటికే వైటీడీ బోర్డు చైర్మన్ కోసం ఉమ్మడి నల్లగొండ(Nalgoanda) జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తనకు సంబంధించిన వ్యక్తికే చైర్మన్ అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో సీఎం స్వయంగా నిర్ణయం తీసుకొని చైర్మన్ పదవి అప్పగిస్తారా? లేకుంటే ఇద్దరు మంత్రులకు చెందిన వ్యక్తులకు విడుతల వారీగా ప్రాధాన్యం కల్పిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చజరుగుతుంది. ఏది ఏమైనా త్వరలోనే బోర్డు కొలుదీరనుందని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.

Also Read: BRS: రిజర్వేషన్లపై బీఆర్ఎస్ రాష్ట్రపతిని కలుస్తుందా?

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ