Actress: సినిమా ఇండస్ట్రీలో ఒక రోజు మంచిగా ఉంటే.. ఇంకో రోజు పరిస్థితులు మారిపోతాయి. ఇదొక రంగురంగుల ప్రపంచం. అక్కడ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు తక్కువని చాలామంది అన్నారు. అందరూ అలా ఉండరు కానీ, కొందరు మాత్రం అలాంటి ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా, కొందరు నటీనటులు, చిన్న చిన్న సమస్యల్ని కూడా తట్టుకోలేక, సంబంధాలను పుస్తకంలోని పేజీల్లా తేలిగ్గా తీసేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఒక యువ నటి, ఇండస్ట్రీలో పెద్ద స్టార్ కూతురిగా ఎంట్రీ ఇచ్చి, తన సొంత టాలెంట్‌తో తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: Ranchander Rao: మరోసారి దేశ విభజన ప్రసక్తే ఉండొద్దు.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు
అయితే, ఈ అమ్మడు తరచూ ఏదొక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ హీరోయిన్ మొదట ఒక విదేశీ వ్యక్తితో ప్రేమలో పడి, కొంతకాలం అతనితో గడిపింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది. కానీ ఏమైందో ఏమో, వారి మధ్య సంబంధం బ్రేకప్‌తో ముగిసింది. అయినా, ఆమె వదిలేసి.. కొంచం కూడా బాధపడకుండా, మరో వ్యక్తితో ప్రేమాయణం మొదలుపెట్టింది.
Also Read: Dornakal Irrigation Department: డోర్నకల్ ఇరిగేషన్ కార్యాలయంలో మద్యం పార్టీ చేసుకుంటున్న అధికారులు
అతనితోనూ కొంతకాలం తిరిగిన తర్వాత, ఆ రిలేషన్షిప్ ను కాదనుకుని గుడ్‌బై చెప్పింది. ఇక సినిమాలపై ఫోకస్ పెట్టి సంతోషంగా జీవనం సాగిస్తోంది.ఇదిలా ఉండగా, ఇప్పుడు తాజాగా ఈ హీరోయిన్ ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ డైరెక్టర్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ డైరెక్టర్‌కు ఇప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ ఈ హీరోయిన్ అతని చుట్టూ తిరుగుతూ, తన ప్రేమను ఒప్పించే ప్రయత్నం చేసిందట. ఒకసారి ఆమె బహిరంగంగానే నువ్వు అంటే ఇష్టం.. నువ్వు లేకుండా.. “నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడంతో, డైరెక్టర్ కోపంతో ఊగిపోయి.. “నాకు పెళ్లైంది, పిల్లలు ఉన్నారు” అంటూ గట్టిగా క్లాస్ పీకాడట. అయినా, ఈ హీరోయిన్ అతనితో స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ, అతని వెంటే ఉంటోందని టాక్. ప్రస్తుతం, వీరిద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేశారు, ఇది త్వరలో మన ముందుకు రానుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
