Pcc president Sithakka : సీతక్కకు అనుకూల సిగ్నల్స్
Sithakka pcc president post
Political News, Top Stories

Hyderabad:సీతక్కకు అనుకూల సిగ్నల్స్

  • పీసీసీ అధ్యక్ష బరిలో సీతక్క పేరు
  • అధిష్టానాన్ని ఒప్పించే పనిలో సీఎం బిజీ
  • పార్టీ కోసం కష్టపడే స్వభావం ఉన్న సీతక్క
  • సీతక్కపై పార్టీలో అందరికీ ఏకాభిప్రాయమే
  • పేర్ల పరిశీలనలో ముందు వరసలో ఉన్న సీతక్క
  • పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న సీనియర్ నేతలు

Pcc president Telangana race Mulugu Sithakka may be next cm Reventh support:
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తారు అనేది కాంగ్రెస్ వర్గాలలో టెన్షన్ కలిగిస్తోంది. ఇప్పటికీ ఈ సీటు తనకే ఇవ్వాలని భట్టి విక్రమార్క పట్టుబడుతున్న నేపథ్యంలో మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పేరు సైతం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే సీఎం స్థానం ఓసీ, డిప్యూటీ సీఎం, స్పీకర్ లు ఎస్సీలకు చెందినవారు కాగాఈ సారి పీసీసీ అధ్యక్షుడిగా బీసీకి చెందిన అభ్యర్థిని ఎంచుకోవాలని పార్టీలో ఒత్తిడి పెరిగిపోతుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి వచ్చింది. ఆదివాసి మహిళకు పార్టీ పగ్గాలు ఇస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే బీసీ వర్గాల నుంచి మరొకరి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, మధు యాష్కి తదితర సీనియర్లంతా పీసీసీ పీఠం కోసం పట్టుబడుతుండగా…సీఎం రేవంత్ టీమ్ కు చెందిన ములుగు సీతక్కకి పీసీసీ ఇస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ మేరకు సీతక్కకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇక అధిష్టానం లాంఛనంగా సీతక్క పేరు ప్రకటించడమే తరువాయి.

గిరిజన మహిళకు పగ్గాలిస్తే.. సానుకూలత

గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే పార్టీకి సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న ఇతర నేతలు సైతం సీతక్క అనగానే ఏకాభిప్రాయానికి వస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే సీతక్కపై అందరికీ సదభిప్రాయమే ఉంది. పార్టీ కోసం ఆమె కష్టపడి పనిచేస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. సీతక్కకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గం ఆదరణ పొందడమేగాకుండా, మహిళల నుంచి కూడా పార్టీకి సానుకూలత ఉంటుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. పైగా పీసీసీ చీఫ్ గా పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కు తొలి ఆదివాసి మహిళగా గుర్తింపు ను ఇచ్చినట్లవుతుందని అధిష్టానం కూడా భావిస్తున్నట్లు సమాచారం. . ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే ఎవరి నుంచి వ్యతిరేకత రాదని కొందరి వాదన. అందుకే సీతక్క పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుందని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పొలిటికల్ సైన్స్ లో పీహెచ్ డీ

సీతక్క. ఈ పేరు రెండు తెలుగురాష్ట్రాలలోనూ సుపరిచితమే. ఈమె అసలు పేరు ధనసరి అనసూయ సీతక్క. కానీ సీతక్కగానే ఆమె చిరపరిచితురాలు. పొలిటికల్ సైన్స్‌లో ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. సీతక్క తల్లిదండ్రులు సమ్మయ్య, సమ్మక్క. సీతక్కకు ఒక కుమారుడు ఉన్నారు. పేరు సూర్య. గతంలో జనశక్తి గ్రూపులో దళసభ్యరాలుగా ఉన్న ఆమె, తను ప్రేమించిన శ్రీరాములునే పెళ్ళి చేసుకున్నారు. కానీ తరువాత విడిపోయారు. ఏ మార్పు కోసం తాను అడవి బాట పట్టానో, అడవిని వీడాకా కూడా తన లైను మార్చుకోలేదని ఆమె చెప్తుంటారు.అనసూయ మావోయిస్ట్ పార్టీలో చేరినప్పుడు పదో తరగతి చదువుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన సీతక్క తరువాత జనజీవన స్రవంతిలోకి వచ్చారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు లా కూడా చదివారు.

2018, 2023 ములుగు క్వీన్

సీతక్క తెలుగుదేశం పార్టీ తరపున 2004లో ములుగు నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. తరువాత 2009లో వీరయ్యపైనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేశారు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2018లో సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018, 2023 ములుగు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. సీతక్క నిరాండబరత, సామాన్యుల్లో సామాన్యురాలిగా కలిసిపోయే స్వభావమే ఆమెకు ప్రత్యేకతను తీసుకువచ్చిందంటారు రాజకీయ విశ్లేషకులు.
అయితే, పార్టీ పగ్గాలను సీతక్క చేపట్టేందుకు అంగీకరిస్తుందా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పీసీసీగా ఒప్పుకుంటే మంత్రి పదవిలో కొనసాగుతారా? లేక రాజీనామా చేస్తారా అని చర్చలు జరుగుతున్నాయి.

Just In

01

Jupally Krishna Rao: కొల్లాపూర్‌లో కాంగ్రెస్ హవా.. 50 స్థానాలు కైవసం : మంత్రి జూపల్లి

Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఇది వేరే లెవల్!

Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!

Bondi Beach Shooting: బాండి బీచ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్.. భారత పాస్‌పోర్టులతో ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన దుండగులు

West Bengal Voter’s: బెంగాల్‌లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు