Mirai Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Mirai Rights: బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థకు.. టాలీవుడ్ సూపర్ హీరో సినిమా రైట్స్

Mirai Rights: ‘హనుమాన్’ (Hanuman) మూవీతో సంచలన విజయాన్ని అందుకుని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జా. ఆ మూవీ తర్వాత తేజ సజ్జా (Teja Sajja) క్రేజ్ మాములుగా లేదంటే నమ్మాలి. ఇప్పుడు మరోసారి అదే బాటలో ఆయన చేస్తున్న చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తేజ సజ్జా సూపర్ యోధగా అలరించబోతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక బ్లాస్టింగ్ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. అదేంటంటే..

Also Read- Pawan Kalyan: ” తప్పంతా నాదే ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అలాగే ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ కూడా చాలా సంతృప్తికరంగా ఉందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్ర హిందీ రైట్స్‌ (Mirai Rights)ని ‘బాహుబలి’ వంటి చిత్రాన్ని విడుదల చేసిన బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ (Dharma Productions) సొంతం చేసుకుంది. అవును, ఈ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ లీడింగ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar).. ‘మిరాయ్’ హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నారు. దీంతో ‘మిరాయ్’ నార్త్‌లో ఏ రేంజ్‌లో విడుదలకానుందో అర్థం చేసుకోవచ్చు. మ్యాసివ్‌గా రిలీజ్ ‘మిరాయ్’కి నార్త్‌లో దక్కబోతోంది. ‘బాహుబలి, దేవర’ వంటి తెలుగు బ్లాక్‌బస్టర్‌లతో ధర్మ ప్రొడక్షన్స్‌కు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ వుండటంతో.. ఈ కొలాబరేషన్‌లో ‘మిరాయ్’ పై మరింత ఎక్జయిట్‌మెంట్ పెంచేస్తోంది.

Also Read- Meenakshi Chaudhary: వరుసగా మూడోసారి సంక్రాంతి బరిలో.. ఈసారి మాత్రం స్పెషల్ ఇదే!

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్, టీజర్‌ నేషనల్ వైడ్‌గా అద్భుతమైన స్పందనను రాబట్టుకున్నాయి. మొదటి సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గా టాక్ వినబడుతోంది. బిజినెస్ పరంగా కూడా ఇప్పటికే నిర్మాత లాభాల్లో ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా మరోసారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనేలా చిత్రయూనిట్ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తుండటం విశేషం. తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రియా శరణ్, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ కూడా అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను ఆయనే రూపొందించారు. ఈ సినిమా 2D, 3D ఫార్మాట్‌లలో ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..