Bipasha vs Mrunal Thakur: ‘సీతారామం’ (Sita Ramam) సినిమాతో ఎక్కడా లేని క్రేజ్‌ని సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. సోషల్ మీడియాలో షేర్ చేసే హాట్ హాట్ ఫొటోలతోనూ ఎప్పుడూ వైరల్ అవుతుంటుంది. ‘సీతారామం’ సినిమాలో కనిపించిన మృణాల్ ఠాకూరేనా అనే విధంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు ఉంటాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొత్తగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వైరల్ అవడంతో.. కొన్ని రోజుల పాటు ఆమె ట్రెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చి, ధనుష్ కేవలం ఫ్రెండ్ మాత్రమే అని.. వినిపిస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఈ స్టేజ్‌కి రావడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పుకునే మృణాల్ ఠాకూర్.. మరో నటిపై మాత్రం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడి.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ నటి ఎవరో కాదు.. బిపాసా బసు (Bipasha Basu).
Also Read- Khammam Police Station: మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా పడుకున్న వ్యక్తి.. 11 మందిపై కేసు నమోదు
బిపాసా బసు టాలీవుడ్ ప్రేక్షకులకూ పరిచయమే. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) నటించిన ‘టక్కరి దొంగ’ చిత్రంలో బిపాసా బసు హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఒకట్రెండు సౌత్ ఫిల్మ్స్‌తో కూడా నటించిందీ బాలీవుడ్ భామ. బిపాసాను ఉద్దేశిస్తూ.. ‘‘బిపాసా బసు కంటే నేను అందంగా ఉంటాను. ఆమెను నేను ఎప్పుడు చూసినా కండలు తిరిగిన శరీరంతో మగాడిలా కనిపిస్తుంటుంది. ఆమెతో పోలిస్తే నేను ఎంతో అందంగా ఉంటాను’’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఆమె మాట్లాడుతున్న ఈ వీడియో బాగా వైరల్ అవుతూనే ఉంది. ఆమె మాటల్ని బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు తప్పుపట్టారు కూడా. అయినా కూడా తన మాటల్ని మృణాల్ వెనక్కి తీసుకోలేదు. తాజాగా తనపై మృణాల్ చేసిన కామెంట్స్‌పై బిపాసా బసు ఇన్-డైరెక్ట్‌గా ఇచ్చి పడేసింది.
Also Read- Meenakshi Chaudhary: వరుసగా మూడోసారి సంక్రాంతి బరిలో.. ఈసారి మాత్రం స్పెషల్ ఇదే!
తాజాగా బిపాసా బసు మహిళలను ఉద్దేశిస్తూ పెట్టిన కొటేషన్.. మృణాల్‌కు కౌంటరే అంటూ అంతా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ కొటేషన్ ఏంటంటే.. ‘‘బలమైన మహిళలు ఎప్పుడూ కూడా ఒకరి ఎదుగుదలకు మరొకరు కృషి చేస్తారు. మహిళలందరూ బలంగా, ధృడంగా ఉండాలి. అప్పుడు మాత్రమే వారు శారీరకంగానూ, అలాగే మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నట్టు. అమ్మాయిలు బలంగా ఉండకూడదనే ఓల్డ్ మైండ్ సెట్ నుంచి ఇకనైనా బయటకు రండి’’ అని తెలుపుతూ.. ‘ఎల్లప్పుడు మిమ్మిల్ని మీరు ప్రేమించుకోండి’ అనే క్యాప్షన్‌ని జత చేశారు బిపాసా బసు. అంతే, ఇది మృణాల్‌కు కౌంటరే అన్నట్లుగా టాక్ మొదలైంది. వాస్తవానికి ఆమె మృణాల్ పేరు చెప్పలేదు కానీ.. ఇన్ డైరెక్ట్‌గా ఈ కొటేషన్, ఆమెను ఉద్దేశించే అని ఇట్టే తెలిసిపోతుంది. ‘మహిళలు బలంగా ఉండాలి, నీ పాతకాలపు ఆలోచన నుంచి బయటకు రా’ అన్నట్లుగా బిపాసా ఇచ్చిపడేసిందని.. అంతా అనుకుంటున్నారు. మరి ఈ కొటేషన్‌పై మృణాల్ మళ్లీ రియాక్ట్ అవుతుందేమో చూద్దాం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు