Coolie OTT: రజినీకాంత్ ‘కూలీ’ ఓటీటీలోకి ఎప్పుడంటే..
coolie-ott( image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Coolie OTT: రజినీకాంత్ ‘కూలీ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Coolie OTT: రజినీకాంత్ నటించిన కూలీ చిత్రం ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. రజినీకాంత్‌ 171వ చిత్రంగా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించారు. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ తారాగణంతో రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన వార్త ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. కూలీ సినిమా థియేట్రికల్ రన్‌లో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దాని ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read also- Ponguleti srinivas reddy: భారీ వర్షాల ఎఫెక్ట్.. కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి అత్యవసర భేటి.. కీలక ఆదేశాలు జారీ!

ఓటీటీ విడుదల వివరాలు
కూలీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్(Coolie OTT) హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం దాదాపు రూ.120 కోట్లు ఉంటుందని అంచనా. ఇది తమిళ సినిమా చరిత్రలో అత్యధిక ఓటీటీ డీల్‌లలో ఒకటిగా నిలిచింది. విజయ్‌ లియో చిత్రంతో సమానంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో 8 వారాల పాటు (అంటే, సుమారు 56 రోజులు) రన్ అయిన తర్వాత, కూలీ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన విడుదల తేదీ సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ మొదటి వారం మధ్యలో ఉండవచ్చని అంచనా. కొన్ని వర్గాలు సెప్టెంబర్ 11 లేదా 12, 2025న స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన తేదీ తెలియాలంటే సన్ పిక్చర్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read also- Rajinikanth vs War 2: రజినీ కాంత్ Vs ఎన్టీఆర్.. ప్రేక్షకుల తుది తీర్పు ఇదే!

కూలీ చిత్రం రజినీకాంత్ స్టార్ పవర్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వ నైపుణ్యం, బలమైన సాంకేతిక బృందం కలయికతో 2025లో అతిపెద్ద తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీని ఓటీటీ విడుదల అభిమానులకు ఇంటి వద్ద నుండే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది. ఖచ్చితమైన స్ట్రీమింగ్ తేదీ కోసం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూడాల్సి ఉంటుంది, కానీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2025లో కూలీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..