Rajinikanth vs War 2: ఈ రోజు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే, ఉదయం నుంచి ప్రేక్షకులు, ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదు. మరి, ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకి ప్రేక్షకులు ఓటేశారు.
కూలీ సినిమా
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన (Rajinikanth) చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది. ఇంకా ఈ మూవీలో తెలుగు స్టార్ హీరో మన్మథుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) నెగిటివ్ రోల్‌లో నటించాడు. వీళ్ళే కాకుండా, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, శృతిహాసన్, సత్యరాజ్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ను అందించిన ఈ సినిమా ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. నాగార్జున తొలిసారి విలన్‌గా నటించి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అతని ఇంట్రడక్షన్ సీన్ మరియు రజనీతో క్యాట్ అండ్ మౌస్ గేమ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. సాంగ్స్ సినిమాకు ఊపును తెచ్చాయి. ముఖ్యంగా, పూజా హెగ్డే ‘మోనికా’ సాంగ్ విజువల్‌గా ఆకట్టుకుంది.
Also Read: Khammam Police commissioner: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాగులు వంకలు దాటొద్దు.. పోలీస్ కమిషనర్ సూచనలు
‘వార్ 2’ సినిమా
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ – తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘వార్ 2’. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకం పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. హృతిక్ రోషన్ సరసన కియారా అద్వాణీ కథానాయికగా నటించింది. వార్ 2 సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూలో పవర్ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, హృతిక్‌తో డాన్స్ పెర్ఫార్మన్స్ అదిరిపోయాయి.ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. సినిమాలో ఎమోషనల్ సీన్స్‌ను అందరి మనసులను కదిలించాయి.
మరి, ప్రేక్షకులు ఎటు వైపు మొగ్గు చూపారంటే?
కథ పరంగా కూలీ సినిమాకి ప్రేక్షకులు ఓటేశారు. తెలుగు ఆడియెన్స్ వార్ 2 మూవీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని వెళ్ళారు. కానీ, కొందర్ని నిరాశపరిచింది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ రోజు ఉదయం నుంచే థియేటర్ వద్దకు వెళ్లి పేపర్లు చించుతూ సందడీ చేశారు. మొత్తానికి చూసుకుంటే కూలీ సినిమాకే మొగ్గు చూపుతున్నారు.
Also Read: Anti-drug Awareness: క్షణకాలం సంతోషం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్