War 2 Review In Telugu: వార్ 2 సినిమా జెన్యూన్ రివ్యూ
వార్ 2 సినిమా విడుదల తేదీ: ఆగస్టు 14, 2025
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ
దర్శకుడు: అయాన్ ముఖర్జీ
నిర్మాణ సంస్థ: యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF)
జోనర్: స్పై యాక్షన్ థ్రిల్లర్
సినిమా కథ ఏంటంటే?
2019 లో వచ్చిన బ్లాక్‌బస్టర్ వార్ సినిమాకి ” వార్ 2 ” సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో మేజర్ కబీర్ ధాలివాల్ (హృతిక్ రోషన్) దేశానికి మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారతాడు. అతడిని పట్టుకోవడానికి భారత ప్రభుత్వం స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్)ని రంగంలోకి దింపుతుంది. వీరిద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ వివిధ దేశాలలో సాగుతూ థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కియారా అద్వానీ కావ్య లుత్రాగా ఒక మిస్టరీ పాత్రలో కనిపిస్తుంది. సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ లు తమ నటనతో ఆకట్టుకున్నప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయి. యాక్షన్ సీన్స్, కెమిస్ట్రీ, డాన్స్ సీక్వెన్స్‌లను బాగున్నా కూడా కథ, VFX, స్క్రీన్‌ప్లేలో లోపాలు ఉన్నాయనే చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
యాక్షన్ సీక్వెన్స్‌లు: సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కార్ ఛేజింగ్, ట్రైన్ ఫైట్, హృతిక్ రోషన్ జపాన్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా తెరకెక్కించారు.
ఎన్టీఆర్ & హృతిక్ నటన: ఇద్దరు స్టార్ హీరోల నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
యాక్షన్, పెర్ఫార్మెన్స్: ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూలో పవర్ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, హృతిక్‌తో డాన్స్ పెర్ఫార్మన్స్ అదిరిపోయాయి.
విజువల్ సీన్స్ : ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.
ఎమోషనల్ మూమెంట్స్: సినిమాలో ఎమోషనల్ సీన్స్‌ను అందరి మనసులను కదిలించాయి.
నెగిటివ్ పాయింట్స్:
కథ, స్క్రీన్‌ప్లే: సినిమా చూస్తున్నంత సేపు “రొటీన్” , “ప్రిడిక్టబుల్” గా ఉన్నట్లు అనిపించింది. లాజిక్‌లెస్ సీన్స్, స్క్రీన్‌ప్లే సినిమాను నిరాశపరిచాయి.
VFX సమస్యలు: VFX నాణ్యతపై ఇంకా దృష్టి పెట్టి ఉంటే చాలా బావుండేది. ముఖ్యంగా బోట్ చేజ్, ట్రైన్ సీక్వెన్స్‌లలో. అలాగే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ లేకుండా ఉంది.
ఎన్టీఆర్ రోల్‌పై విమర్శలు: ఎన్టీఆర్ ను డైరెక్టర్ సరిగా వాడలేదు. హృతిక్‌తో పోలిస్తే ఆయన పాత్ర పరిమితంగా ఉంది. “ఎన్టీఆర్ మళ్లీ మల్టీ-స్టారర్ రోల్స్‌లో చేయకుండా ఉండటమే బెటర్.
సినిమా గురించి ఒక్క మాటలో చెప్పలంటే.. ఓవరాల్ గా గుడ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాని ఎంజాయ్ చేయోచ్చు.
War 2 Movie Review Rating : 2.25/5