Uttam Kumar Reddy: 72 గంటలు ఆయా కేంద్రాల్లోనే ఉండాల
Uttam Kumar Reddy(iMAGE credit: swetcha reportr)
Telangana News

Uttam Kumar Reddy: 72 గంటలు ఆయా కేంద్రాల్లోనే ఉండాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

Uttam Kumar Reddy: అలసత్వం వద్దు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రౌండ్ ది క్లాక్ అప్రమత్తంగా ఉండాలన్నారు.  నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగార్జునసాగర్, జూరాల, కడెంతో సహా ప్రధాన ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, రానున్న 72 గంటలలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు.

 Also Read: Manchu Lakshmi: యాప్ వాళ్లు ఎలా సంప్రదించారు? మూడున్నర గంటలపాటు ఈడీ ప్రశ్నల వర్షం

పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టాలన్నారు. కాల్వ కట్టలు తెగిపోయే సూచనలు గుర్తించి ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన నిధులు కోసం జీఓ 45 ప్రకారం అత్యవసర నిధులను వినియోగించుకోవాలని సూచించారు. పాలనాపరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్(Police)  అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి విపత్తులు సంభవించకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ కాన్ఫరె‌న్స్‌లో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 Als Read: Harish Rao: రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఉన్నా పనులు సున్నా: హరీష్ రావు

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!