Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాగా లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయిన పూజా హెగ్డే, సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా.. కొన్ని బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్న పూజా హెగ్డేకు అక్కడ కూడా ఏమంత ఆశించినట్లుగా అయితే లేదు. టాలీవుడ్‌లో అయితే ప్రస్తుతం పూజా పేరే తలవడం లేదు. ఇక కోలీవుడ్‌లో మాత్రం అమ్మడి పరిస్థితి పర్లేదనే చెప్పుకోవచ్చు. అయితే కోలీవుడ్ పరంగానూ పూజా హెగ్డేకి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఆమె మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తుందనేలా టాక్ మొదలైంది.
Also Read- Bigg Boss Agnipariksha: వీడియో లీక్.. ఎందుకంత సీరియస్ అంటూ నవదీప్‌పై కౌంటర్స్!
వాస్తవానికి టాలీవుడ్ నుంచి ఆమెను ఎవరూ వెళ్లగొట్టలేదు. తనే కావాలని గ్యాప్ తీసుకుంది. టాలీవుడ్ నుంచి ఎవరైనా ఆఫర్ ఇస్తే.. కళ్లు చెదిరేలా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో, దర్శకనిర్మాతలు ఆమెను పట్టించుకోవడం మానేశారు. మరోవైపు నేషనల్ క్రష్ రష్మికా మందన్నాతో కాంపిటేషన్‌ని కూడా ఆమె తట్టుకోలేకపోయిందని చెప్పుకోవాలి. ఇక్కడ టాలీవుడ్‌లో, అక్కడ బాలీవుడ్‌లో రష్మికా మందన్నా పేరు బాగా వైరల్ అవడంతో.. పూజాని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న రెండు అవకాశాలే.. మళ్లీ ఆమెను సౌత్‌లో బిజీ హీరోయిన్‌ని చేస్తాయని పూజా ఆశపడుతోంది.
ఆ రెండు అవకాశాలు మరేవో కావు.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కూలీ’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది పూజా హెగ్డే. మోనికా.. అంటూ వచ్చిన ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవడమే కాకుండా.. రీల్స్‌తో రచ్చ లేపుతోంది. ఈ సాంగ్ పెద్ద సక్సెస్ అవడంతో.. రేపు సినిమా విడుదలై సక్సెస్ అయితే తనకు మరింత పేరు వస్తుందని పూజా భావిస్తోంది. మరో చిత్రం విషయానికి వస్తే.. విజయ్ ఆఖరి చిత్రమని చెప్పుకుంటున్న ‘జన నాయగన్’. ప్రస్తుతం పూజా హీరోయిన్‌గా చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే మళ్లీ సౌత్‌లో పట్టు సంపాదించవచ్చని భావిస్తున్న పూజా.. మరో సైడ్ నుంచి కూడా బాణం గురి పెడుతోంది.
Also Read- Tribanadhari Barbarik Trailer: కట్టప్ప, ఉదయభానుల ‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?
అవును, రెబల్ స్టార్, పాన్ ఇండియా కా కింగ్ ప్రభాస్‌తో సినిమా చేయాలని ఆశపడుతోంది పూజా హెగ్డే. ఆల్రెడీ ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్‌తో జతకట్టిన ఈ బ్యూటీ.. మరోసారి ప్రభాస్‌ని లైన్‌లో పెడితే.. టాలీవుడ్‌లోనూ మరోసారి తన సత్తా చాటవచ్చని భావిస్తోంది. మళ్లీ తెలుగులో ఎలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘బాహుబలి 3’ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుందని ప్రకటించింది. ఈ సినిమాలో అవకాశం కోసం డార్లింగ్ ప్రభాస్‌ను అవసరమైతే రిక్వెస్ట్ కూడా చేస్తానని పూజా చెప్పుకొచ్చింది. అంతే, ప్రభాస్ సినిమాలో.. పూజా మంచి స్కెచ్చే వేసిందిగా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు