Traffic DCP
తెలంగాణ

Traffic DCP: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించటంతో పాటు..?

Traffic DCP: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి (Traffic DCP Venugopal Reddy) చెప్పారు. అధికశాతం యాక్సిడెంట్లు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే జరుగుతున్నాయన్నారు. గోపాలపురంలోని సెయింట్ మేరీ సెంటినరీ జూనియర్ కాలేజీ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు–నివారణ అన్న అంశంపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చాలామంది యువకులు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కనిపిస్తుంటారని చెప్పారు. దానికితోడు పరిమితికి మించిన వేగంతో దూసుకెళుతూ సిగ్నళ్లు జంప్ చేస్తుంటారని.. రాంగ్ రూట్లో ప్రయాణిస్తుంటారని తెలిపారు. మరికొందరు ఓ చేత్తో మొబైల్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ, మరో చేత్తో డ్రైవింగ్ చేస్తుంటారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదాలు జరగటం ఖాయమని చెప్పారు. ఇలా జరుగుతున్న యాక్సిడెంట్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరెంతో మంది అంగవికలురుగా మారుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధించటంతో పాటు కొన్నిసార్లు జైలుకు రిమాండ్ చేస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారితో పాటు వెనక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఇక డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.

Also Read- Tribanadhari Barbarik Trailer: కట్టప్ప, ఉదయభానుల ‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్‌ ఎలా ఉందంటే?

బేగంపేట ట్రాఫిక్​ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్స్‌పెక్టర్ నాగుల అశోక్​ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పారు. ప్రమాదాలు ఉచితంగానీ.. అవయవాలు ఉచితం కాదన్నారు. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వల్ల తమ ప్రాణాలు పోగొట్టుకోవటమే కాకుండా ఇతరుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారని చెప్పారు. ఇక, రోడ్డు దాటే సమయంలో జీబ్రా లైన్ వద్దనే దాటాలని సూచించారు. సిగ్నల్ జంప్​ చేయవద్దన్నారు. ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని చెప్పారు. విద్యార్థులు సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గోపాలపురం ట్రాఫిక్​ స్టేషన్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ ట్రాఫిక్​ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్​ ఫాదర్ జ్ఞానరెడ్డి, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అయాన్, కృష్ణతోపాటు 320 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read- Congrats to Hydraa: హైడ్రా జిందాబాద్ అంటూ ఆ కాలనీవాసులు సందడి.. ఆ ఒక్క పనితో ప్రజల్లో ఆనందం

పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించిన విషయాలివే:

ట్రిపుల్ రైడింగ్

సిగ్నళ్లు జంప్

రాంగ్ రూట్లో ప్రయాణిస్తుండటం

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ (సెల్ ఫోన్ డ్రైవింగ్)

లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం

ద్వి చక్ర వాహనంపై వెనక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

రోడ్డు దాటే సమయంలో జీబ్రా లైన్ వద్దనే దాటాలి

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!