War 2 Movie: ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (Jr NTR)లతో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’ (War 2). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచడమే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగేలా చేశాయి. ఇక ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. అభిమానులకు స్పాయిలర్‌ల గురించి హీరోలు ఒక రిక్వెస్ట్ చేశారు.
Also Read- People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతపై ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫైర్
వాస్తవానికి రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ రిక్వెస్ చేశారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లను దయచేసి సోషల్ మీడియాలో పెట్టవద్దంటూ వేడుకున్నారు. అలా చేసి, సినిమా చూడబోయే వారి థ్రిల్ మిస్ చేయవద్దని ఎన్టీఆర్ కోరారు. మొదటి షో పడగానే అన్ని ట్విస్ట్‌లు రివీల్ అవుతాయి.. ఎవరూ దానిని ఆపలేరు. కాకపోతే సాధ్యమైనంతగా దానిని కాస్త కంట్రోల్ చేయాలని అభిమానులకు ఎన్టీఆర్ ఓ సూచన చేశారు. ఇదే విషయాన్ని మరోసారి అగ్ర హీరోలిద్దరూ ప్రత్యేకంగా తెలియజేశారు.
‘‘ఈ ‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ప్రతి ఒక్కరినీ అలరించాలని ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడాలని కోరుతున్నాం. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో రివీల్ చేయకండి. అలాగే స్పాయిలర్‌లను ఆపండి. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులకు మేము చేస్తున్న రిక్వెస్ట్. మీరు (అభిమానులు) ఈ సినిమాను మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదం.. మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్స్ ఆ సీక్రెట్స్, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ఈ సినిమా కథను రహస్యంగా ఉంచండి’’ అని హృతిక్, ఎన్టీఆర్ తెలిపారు.
Also Read- Dating With AI: 5 నెలలుగా ఏఐతో డేటింగ్.. నిశ్చితార్థం కూడా జరిగింది.. యువతి షాకింగ్ ప్రకటన!
కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. మేకర్స్ స్టోరీ సీక్రెట్ తెలియకూడదని టీజర్, ట్రైలర్లలో కూడా చాలా రహస్యంగా ఉంచిన విషయం తెలిసిందే. మరి ఎంత వరకు అభిమానులు ఈ రహస్యాన్ని బయటకు రానివ్వకుండా ఆపగలరో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు