Jogipet CI: జోగిపేట సీఐ పిస్టల్ మిస్ ఫైర్..
Jogipet CI ( Image Source: Twitter)
Telangana News

Jogipet CI: జోగిపేట సీఐ పిస్టల్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌‌కు తప్పిన ప్రమాదం

Jogipet CI: జోగిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) అనీల్ కుమార్ తన కార్యాలయంలో పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అది అనుకోకుండా పేలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం సీఐ కార్యాలయంలో చోటు చేసుకుంది. సీఐ తన కుర్చీలో కూర్చుని పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్‌ పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లి గోడకు తగలడంతో గోడ పగిలింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన హెడ్ కానిస్టేబుల్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

ఆ సమయంలో సీఐ చింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతున్నారని, అనుకోకుండా పిస్టల్ ట్రిగ్గర్‌పై చెయ్యి పడటంతో అది పేలిందని భావిస్తున్నారు. ఈ ఘటనతో కార్యాలయంలో ఉన్న వట్‌పల్లి ఎస్ఐ, ఆందోల్ మాజీ కౌన్సిలర్ హరికృష్ణ, ఆత్మ డైరెక్టర్ రొయ్యల శ్రీనివాస్ సహా అక్కడున్నవారంతా బయటకు పరుగులు తీశారు. పక్క స్టేషన్ బయట ఉన్న జోగిపేట ఎస్ఐ పాండు కూడా శబ్దం విని సీఐ కార్యాలయం వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు.

Also Read: Trump on Gold Tariffs: రికార్డ్ స్థాయిలో పెరిగిన పసిడి రేటు.. దిగుమతులపై టారిఫ్ ఉండదని స్పష్టం చేసిన ట్రంప్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?