ntr ( image :X)
ఎంటర్‌టైన్మెంట్

War 2 Bookings: ‘వార్ 2’ లో ఎన్టీఆర్ చేసిన తప్పులు ఇవేనా!

War 2 Bookings: ‘వార్ 2’ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, 2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్‌గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ (మేజర్ కబీర్), జూనియర్ ఎన్టీఆర్ (విలన్ వీరేంద్ర), కియారా అద్వానీ, అశుతోష్ రాణా, అనిల్ కపూర్‌లతో 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ప్రీతమ్ సంగీతంతో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14, 2025న U/A 16+ సర్టిఫికేట్‌తో 2 గంటల 53 నిమిషాల రన్‌టైమ్‌తో విడుదల కానుంది.

Read also- Jangaon Strange Incident: రాష్ట్రంలో అద్భుతం.. వింతగా ప్రవర్తించిన చెట్టు.. ఇది దేవుడి మహిమేనా?

తెలుగులో ఎన్టీఆర్ స్టార్డమ్ ఏంటో తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజున రజనీ కాంత్ ‘కూలీ’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు స్టైట్ తెలుగు సినిమాలు కాకపోయినా టాలీవుడ్ అగ్ర కథానాయకులు వాటిల్లో ఉన్నారు. ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమాకంటే ‘కూలీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో దూసుకుపోతుంది. ‘వార్ 2’ (War 2 Bookings) కనీసం తెలుగులో కూడా సత్తా చాటలేకపోతుంది. తెలుగులో అయితే ప్రీ బుకింగ్స్ తగ్గడానికి కారణం ఎన్టీఆర్ అంటూ సినీ పెద్దలు చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఉన్నదానికన్నా ఎక్కువ హైప్ ఇస్తూ మాట్లాడారని, ఓ సందర్భంలో అభిమానులపై మండిపడ్డారని ఇవన్నీ అభిమానుల్లో కొంత అసంతృప్తికి కారణమయ్యాయంటూ క్రిటిక్స్ భావిస్తున్నారు.

Read also- Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

అంతే కాకుండా బాలీవుడ్ కు వెళితే మాత్రం అలా మాట్లాడాల్సిన పనిలేదంటున్నారు అభిమానులు. ఇవన్నీ అలా ఉంచితే ‘వార్ 2’సినిమాలో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. దీనిని అభిమానులకు అంతగా రుచించడం లేదు. అందువల్లే సినిమా ప్రీ బుకింగ్స్ తగ్గాయని అభిమానులు అంటున్నారు. ఏదీ ఏమైనా
సినిమా బాగుంటే ఏవ్వరైనా చూస్తారు అంత హైప్ ఇవ్వాల్సిన పనిలేదని అభిమానులు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. కొన్ని ప్రత్యేక థియేటర్లలో ప్రీమియర్ షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు