School Holidays: స్కూల్‌కి సెలవు అనే (School Holidays) మాట వినిపిస్తే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు!. పాఠశాలకు సెలవు రావడం చిన్నారులకు ఒక పండుగలా అనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రోజు రెండుల సెలవులకే మురిసిపోతుంటారు. అలాంటిది వరుసగా మూడు రోజులు హాలీడేస్ వస్తున్నాయంటే మరెంతో ఆనందపడతారో!. అవును, ఏపీ, తెలంగాణలోని స్కూల్ పిల్లలకు పండగలాంటి న్యూస్ ఇది. స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి వంటి పండుగలతో ఈ నెలలో మరిన్ని సెలవులు ఊరిస్తున్నాయి.
వరుసగా మూడు రోజులు..
హైదరాబాద్‌తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఈ వారంలో మూడు రోజుల సెలవులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి 17 వరకు స్కూల్స్ మూతపడనున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంతో సెలవులు మొదలుకానున్నాయి. ఆ రోజున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పూర్తయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్లిపోతారు. కాబట్టి, ఆ రోజు సెలవుదినం. దేశవ్యాప్తంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
16న కృష్ణాష్టమి
ఈ నెల 16న శ్రీకృష్ణాష్టమి వచ్చింది. ఆ రోజు దేశవ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ రోజు స్కూళ్లకు సెలవు. శ్రీకృష్ణుడు జన్మించిన ఆ రోజును హిందువులు పవిత్రంగా భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఆలయాలు, సముదాయాలు రాత్రివేళల వరకు శోభాయమానంగా వెలుగుతాయి. వేడుకలు ఆహ్లాదకరంగా జరుగుతాయి. ఉట్టి కొట్టే వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఆగస్టు 17న ఆదివారం
15న స్వాతంత్ర్య దినోత్సవం, మరుసటి రోజు (ఆగస్టు 16) శ్రీకృష్ణాష్టమి తర్వాత… ఆదివారం వచ్చింది. వారంతపు సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో, పిల్లలకు మూడు రోజులపాటు స్కూల్‌కు విరామం లభించింది.
Read Also- Swetcha Special story: భద్రాద్రి కొత్తగూడెంలో రాజ్యమేలుతున్న కల్తీ రాయుళ్లు.. అవి తిన్నారా..?
సెలవులతో ప్రయోజనాలు
విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణలో సెలవులు ఎంతో ముఖ్యమైనవి. పండగ సీజన్ కావడంతో సాంస్కృతిక భాగస్వామ్యానికి పిల్లలకు ఒక అవకాశం లభిస్తుంది. ఈ విరామం తర్వాత విద్యార్థులు మళ్లీ ఉత్సాహంగా, ఆనందంగా తిరిగి స్కూళ్లకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సెలవులు కేవలం ఆడుకోవడానికే కాదు, సాంస్కృతిక విలువలను తెలుసుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. సమాజంలో అనుబంధాలను పెంచుతాయి. కుటుంబంతో గడిపే సమయం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలు మానసికంగా విశ్రాంతి పొందుతారు. విద్యార్థుల ఎదుగుదలలో ఇలాంటి విరామాలు కీలక పాత్ర పోషిస్తాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ నెల 27న వినాయక చవితి పండుగ వచ్చింది. కాబట్టి, ఆ రోజున కూడా విద్యార్థులు సెలవు వచ్చింది. మొత్తంగా చూస్తే, ఆగస్టు నెలలో విద్యార్థులకు హాలీడేస్ గట్టిగానే వచ్చాయని చెప్పాలి.
Read Also- Komatireddy Raj Gopal: మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు!