Albendazole tablets: రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల 58 వేల 366 (85.58 Lakh Children )మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు (Albendazole Tablets) పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ (Telangana Health Department) ప్రకటించింది. మొత్తం 96 లక్షల టార్గెట్‌లో తొలిరోజే 89 శాతం మంది చిన్నారులకు మాత్రలు పంపిణీ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 9,87,042 మంది చిన్నారులకు పంపిణీ చేయగా, అతి తక్కువగా ములుగులో (Mulugu District) కేవలం 67,535 మందికి పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు స్కూళ్లు,కాలేజీలు, అంగన్‌వాడీ సెంటర్లలో (Anganwadi Centers) మాత్రం ట్యాబ్లెట్ల పంపిణీ కొనసాగనున్నది.
ఇక ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా, తొలిరోజే 85.58 లక్షల మంది చిన్నారులకు ఆల్బండజోల్ (Albendazole Tablets) పంపిణీ చేసిన ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) అభినందించారు. మిగిలిన పిల్లలు కూడా తప్పనిసరిగా మాత్ర తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. 1-19 ఏండ్ల పిల్లలకు తప్పనిసరిగా ఆల్బండజోల్ మాత్ర వేయించాలని మరోసారి ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు