Srushti Fertility Centre Case: రాష్ట్రంలో సంచనం సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసుల విచారణ ముగిసిందని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్(DCP Rashmi Perumal) తెలిపారు. ఇక ఈ కేసును సిట్‌కు అప్పగించామని డీసీపి రష్మీ పెరుమాల్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ(Shrishti Fertility Center) కేసులో ఇప్పటి వరకు మొత్తం 9 FIR లు నమోదు చేశామని తెలిపారు. చాలా మంది దంపతుల వద్ద రూ. 20 నుండి 30 లక్షలు డబ్బులు తీసుకున్నారని మా విచారణలో తేలిందని అన్నారు.
కోంతమందికి DNA టెస్ట్ మ్యాచ్ కాలేదని మాకు మరో ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. సరోగసి పేరుతో చాలా మంది వద్ద డబ్బులు తీసుకున్నారని, ఇప్పటి వరకు మేము 15 కేసులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయినా వారిలో పలువురు డాక్టర్స్ తో పాటు ఏజెంట్స్ కూడా ఉన్నారని డిసిపి రష్మి పెరుమాళ్ తెలిపారు.
అమ్మానాన్నలను చేస్తామని నమ్మించి
సరోగసి పేర చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ డాక్టర్ నమ్రత. ఆమెకు సహకరించిన వారి పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి తాజాగా ఈ కేసులో పోలీసులు విశాఖపట్టణంలో మరో అయిదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు(Doctors). ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు. దీంతో వైజాగ్ నుంచి అరెస్టయిన వారి సంఖ్య 6కు చేరింది. సరోగసి ద్వారా అమ్మానాన్నలను చేస్తామని నమ్మించిన డాక్టర్ నమ్రత(Dr Namratha) 30లక్షలు తీసుకుని మరొకరికి పుట్టిన బిడ్డను రాజస్తాన్ కు చెందిన గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించిన విషయం తెలిసిందే. డీఎన్ఏ(DNA) పరీక్షల్లో ఆ బిడ్డ తమకు పుట్టలేదని నిర్ధారణ కావటంతో గోవింద్ సింగ్ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో డాక్టర్ నమ్రత సంతాన సాఫల్య కేంద్రం పేర నడుపుతూ వచ్చిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also READ: Raksha Bandhan: రోటీన్‌కు భిన్నంగా.. అద్భుతమైన రాఖీ కొటేషన్స్.. ఇవి చాలా స్పెషల్ గురు!
మరో ఇద్దరు వైద్యులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు తాజాగా విశాఖపట్టణంలోని కేజీహెచ్(KBHP) ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ వాసుపల్లి రవి(Ravi), డాక్టర్ ఉషాదేవిలను అరెస్ట్ చేశారు. డాక్టర్ వాసుపల్లి రవి హాస్పిటల్ లోని అనస్తీషియా విభాగంలో పని చేస్తుండగా డాక్టర్ ఉషాదేవి ప్రసూతి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది.
కాసులకు కక్కుర్తి పడి
కాసులకు కక్కుర్తి పడ్డ డాక్టర్ వాసుపల్లి రవి, డాక్టర్ ఉషాదేవిలు డాక్టర్ నమ్రత కొనసాగించిన అక్రమాలకు పూర్తిగా సహాయ సహకారాలు అందించినట్టుగా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. సంతానం కోసం హైదరాబాద్ లో తనను సంప్రదించిన దంపతులకు సరోగసి ద్వారా బిడ్డ కలిగేలా చేస్తామని నమ్మించి డాక్టర్ నమ్రత విశాఖపట్టణం బ్రాంచ్ కు పంపించేది. ఇక్కడ నిర్వాహకురాలిగా పని చేసిన కళ్యాణి ఇలా వచ్చిన భార్యాభర్తలను తన మాయ మాటలతో పూర్తిగా నమ్మించేది. సరోగసికి మహిళ సిద్ధంగా ఉన్నట్టు చెప్పి దంపతుల్లో భర్త నుంచి వీర్యం సేకరించేది.
అయితే, సరోగసి ద్వారా కాకుండా మరొకరికి పుట్టిన శిశువులను లక్ష నుంచి 5లక్షల రూపాయలకు కొని తమ వద్దకు వచ్చిన వారి నుంచి 30 నుంచి 40లక్షలు తీసుకుని ఇచ్చేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే డబ్బుకు ఆశ పడి పిల్లలను అమ్ముకోవటానికి సిద్ధమైన మహిళలకు వైజాగ్ బ్రాంచ్ లోనే ప్రసవాలు చేయిస్తూ రావటం. దీంట్లో డాక్టర్ ఉషాదేవిదే కీలక పాత్ర అని పోలీసు వర్గాల నుంచి తెలియవచ్చింది. అనస్తీషియా డాక్టర్ వాసుపల్లి రవి ఆమెకు సహకరించేవాడని సమాచారం. అరెస్టయిన డాక్టర్ వాసుపల్లి రవి వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యేకు సోదరుడని తెలిసింది.
Also Read: Khammam District: పౌరులకు రాజ్యాంగ విద్య అందించాలి.. సీపీఎం నేత కీలక వ్యాఖ్యలు