Save Singareni( IMAGE Credit: twitter)
తెలంగాణ

Save Singareni: తెలంగాణ బొగ్గుగని ఉద్యమ బాట.. 11 డివిజన్లలో నిరసనలు ధర్నాలు

Save Singareni: సింగరేణి కోల్ బెల్టులో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీజీబీకేఎస్) (TGBKS) బలోపేతంపై బీఆర్ఎస్(Brs)  దృష్టిసారించింది. వచ్చే ఏడాది సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే కార్మికుల సంక్షేమం, బొగ్గు గనులను కాపాడుకోవడమే లక్ష్యంగా ‘సేవ్ సింగరేణి’ నినాదంతో ఉద్యమబాటపట్టేందుకు టీజీబీకేఎస్(TGBKS) సన్నద్ధమవుతుంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలపై నిలదీస్తూ సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. త్వరలోనే సంఘం సమావేశం నిర్వహించి కార్యచరణ ప్రకటించబోతున్నట్లు నేతలు తెలిపారు.

 Also Read: Stray Dogs: నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న వీధి కుక్కలు

బలోపేతానికి..
రాష్ట్రంలోని కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బొగ్గుగనులు ఉన్నాయి. ఈ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూరు, రామగూడెం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి పరిధిలో 11 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో బీఆర్ఎస్(Brs) అనుంబంధ సంఘమైన టీజీబీకేఎస్‌ను బలోపేతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. సంఘం సభ్యత్వ నమోదు సైతం త్వరలోనే చేపట్టనున్నారని సమాచారం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, కార్మికసంఘం ఎన్నికల్లోనూ ఓటమి చవిచూసింది. అయితే గత పరిణామాలను సమీక్షిస్తూ తిరిగి బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాల రూపకల్పనకు సిద్ధమవుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, టెండర్ల అంశాన్ని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు.

హామీల సంగతేంటి?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సింగరేణి(Singareni) కార్మికులకు కాంగ్రెస్(Congress) 6 ప్రధానమైన హామీలను ఇచ్చింది. కొత్త బొగ్గు బావులు, ప్రైవేటీకరణ రద్దు, కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, 20లక్షలు వడ్డీలేని రుణం, మహిళలకు గౌరవప్రదమైన సర్ ఫేజ్(ఉపరితలంపై ఉద్యోగం), సింగరేణి ఏరియాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు హామీ ఇచ్చిందని టీజీబీకేఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దీన్నిపై వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధమవుతుంది. కార్మికులకు ఏకం చేయాలని, గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి, కార్మికులకు కల్పించిన సదుపాయాలను వివరించనున్నామని నేతలు తెలిపారు. బీఆర్ఎస్(Brs) వృత్తి పన్ను రద్దు, 19వేల కార్మికులకు ఉపాధి, 600 నుంచి 700మంది వరకు మహిళలకు ఉపాధి అవకాశం కల్పించిన అంశాలను వివరించి కార్మికులకు చైతన్యం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

పెరిగిన రాజకీయ జోక్యం..
సింగరేణి(Singareni)లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని, దీంతో సంస్థ మనుగడకే ప్రమాదకరంగా మారిందని టీజీబీకేఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వీకే-7 ఓపెన్ కాస్ట్ ఓబీ కాంట్రాక్టును ప్రభుత్వానికి సంబంధించిన నేతకు చెందిన సంస్థకు అప్పగించారని, జైపూర్ ప్లాంట్ టెండర్ల వేలం కోట్ తక్కువ వేయడం ఇలా పలు అంశాలను వివరిస్తామని వెల్లడించారు. ఎక్స్‌ప్లోజివ్స్ టెండర్లలోనూ రూ.200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, మెడికల్ బోర్డు, ట్రాన్స్‌ఫర్స్‌లోనూ ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగిందని, గోదావరి ఖనిలో రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలు చేస్తున్నారని, పీఆర్సీ రెండేళ్లుగా పెండింగ్ ఉందని, ప్రభుత్వ అభివృద్ధి పనులకు సింగరేణి నిధులతో చేస్తున్నారని, సంస్థ మనుగడ కోసం ఖర్చు చేయాల్సిన వాటిని ఇతర సంస్థలకు మళ్లింపు చేసి నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని టీజీబీకేఎస్ పేర్కొంటుంది. వీటన్నింటి నుంచి సింగరేణిని గట్టేక్కించేందుకే ఉద్యమబాటపడుతున్నామని ‘సేవ్ సింగరేణి’(Singareni) తో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు.

హక్కులపై పోరాటం..
టీజీబీకేఎస్ రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో పట్టుసాధించేందుకు సిద్ధమవుతోంది. 2017లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అయితే అప్పటి నుంచి 2023 వరకు ఎన్నికలు నిర్వహించలేదు. 2023లో జరిగిన ఎన్నికల్లో టీజీబీకేఎస్ ఏ ఒక్క డివిజన్లలో కూడా సత్తాచాటాలేక పోయింది. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. 5 డివిజన్లలో ఏఐటీయూసీ, 6 డివిజన్లలో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. అయితే రాబోయే గుర్తింపు సంగం ఎన్నికల్లో సత్తాచాటేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది టీజీబీకేఎస్ . అందుకే కార్మికుల హక్కులపై పోరాటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది.

త్వరలోనే సమావేశం
టీజీబీకేఎస్(TGBKS) ఇన్‌చార్జీగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకం అయ్యారు. సంఘం కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇచ్చిన హామీలపై ఒత్తిడిపెంచేందుకు ఈ వారంలోనే సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సమావేశంలో కార్యచరణ ప్రకటిస్తారని సంఘం నేతలు తెలిపారు. ఈ సమావేశంలో ఏయే అంశాలను చర్చిస్తారనేది చర్చనీయాంశమైంది. ప్రధానంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు సన్నద్ధం, కార్మికుల ప్రయోజనాలు, సింగరేణిని కాపాడుకోవడం తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సంఘం గౌరవాధ్యక్షురాలిగా తాను కొనసాగుతున్నట్లు కవిత(Kavitha)నే స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ కవిత(Kavitha) సింగరేణి జాగృతి బలోపేతంపై దృష్టిసారించడం, హెచ్ఎంఎస్‌తో జతకలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కవిత సైతం టీజీబీకేఎస్ సమావేశాల్లో పాల్గొంటారా? లేదా? అసలు ఆహ్వానిస్తారా? అనేది హాట్ టాపిక్ అయింది.

 Read: SC on Delhi-NCR: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్