Revanth Reddy ( IMAGE cedit: twitter)
తెలంగాణ

Revanth Reddy: రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో రిలీఫ్ దక్కింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదు చేసిన కేసును  హైకోర్టు కొట్టివేసింది. 2019 అక్టోబర్‌లో రేవంత్(Revanth Reddy)ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో నడుస్తోంది. కాగా, ఈ కేసును కొట్టేయాలంటూ ఇటీవల సీఎం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Redd)పై నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 Also Read: Bhoobharati Act: గుట్టలుగా భూభారతి దరఖాస్తులు.. గడువు దగ్గర పరిష్కారం దూరం

సీఎంపై కేసు.. పిటిషనర్‌పై సుప్రీం సీరియస్

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై కేసు పెట్టిన వ్యక్తిపై సుప్రీం కోర్టు (Supreme Court) సీరియస్ అయ్యింది. హైకోర్టు న్యాయమూర్తికి అఫిడవిట్ రూపంలో వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. గచ్చిబౌలిలోని ఓ భూ వివాదంలో పెద్దిరాజు అనే వ్యక్తి సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను కులం పేరుతో దూషించారని పెద్దిరాజు ఫిర్యాదులో పేర్కొనటంతో పోలీసులు సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్య గొడవ జరిగినపుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)అక్కడ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో కేసును కొట్టివేశారు.

ఏఓఆర్‌పై ఆగ్రహం

దీనిపై పెద్దిరాజు సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లాడు. కేసును నాగ్‌పూర్ బెంచ్‌కు బదిలీ చేయాలని ట్రాన్స్‌ఫర్ పిటిషన్ వేశారు. దీంట్లో హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుప్రీం(Supreme Court) కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ పెద్దిరాజు, పిటిషన్‌ను డ్రాఫ్ట్ చేసిన ఏఓఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తెలంగాణ హైకోర్టు(Telangana High Court) న్యాయమూర్తికి అఫిడవిట్ రూపంలో క్షమాపణ చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 Also Read: SKN Producer: ప్రతి క్రాఫ్ట్ వాళ్లు.. మీరు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోండి.. కుండబద్దలు కొట్టేసిన నిర్మాత ఎస్‌కెఎన్

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది