Mynampally Hanumantha Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Mynampally Hanumantha Rao: కేటీఆర్ హరీష్ రావులకు కీలుబొమ్మ ఆయనే.. మైనంపల్లి హనుమంతరావు

Mynampally Hanumantha Rao: కేటీఆర్ (KTR) హరీష్ రావు(Harish Rao) చేతిలో కీలుబొమ్మ చక్రధర్ గౌడ్(Chakradhar Goud) విమర్శలను తాను పట్టించుకోననీ కాంగ్రెస్(Congress) పార్టీ రాష్ట్ర నాయకుడు మల్కాజీ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumantha Rao) అన్నారు. బిఆర్ఎస్(BRS) పార్టీకి తొత్తులుగా మారిన నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే అసలు పట్టించుకోమని విమర్శించారు. చక్రధర్ గౌడ్ కేటీఆర్, హరీష్ రావులకు కీలుబొమ్మ అని విమర్శించారు.

నాయకులపై మాట్లాడేది ఉంది

సిద్దిపేట(Siddipet) జిల్లా అక్బర్ పేట భూపల్లి మండలం కూడవెల్లిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్రధర్ గౌడ్ లాంటి నాయకులు గుర్తింపు కోసం తనలాంటి వారిపై విమర్శలు చేస్తారని, వాటిని పట్టించుకోనని తెలిపారు. బిఆర్ఎస్(BRS) పార్టీలో ఉన్నపెద్దపెద్ద నాయకులపై మాట్లాడేది ఉందని త్వరలోనే వారి చిట్టా విప్పుతానని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ నాయకుల కంటిపై కొనుక్కు లేకుండా చేస్తానని అన్నారు.

Also Read: Hyd Floods: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం

వెనుకడుగు వేయను

బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాననే ఉద్దేశంతో చక్రధర్ గౌడ్(Chakradhar Goud) లాంటి కొంతమంది నాయకులకు డబ్బులు ఇచ్చి విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. అడ్డుపడేటువంటి నాయకులను బుల్డోజర్ తో తొక్కించుకుంటూ ముందుకు వెళ్తానని మైనంపల్లి(Mynampally) అంటేనే ధైర్యమని, ప్రాణం పోయేంత వరకు వెనుకడుగు వేయనని తెలిపారు. తనకు ఎలాంటి వ్యసనాలు లేవని, వ్యసనాలు ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే భయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Srinivass Reddy), ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి(Raji Reddy), దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.

Also Read: MLA Matta Ragamayi: ప్రజా సేవా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి

Just In

01

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?