Nidhhi Agerwal: సోమవారం అంతా సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. అవేంటంటే, ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. స్టోర్ ఓపెనింగ్స్‌కు వెళుతున్నా ఏపీ ప్రభుత్వ వాహనాన్నే వాడుతుందని, ఏపీ సొమ్మును ఇలా ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తున్నారంటూ ఒకటే పోస్ట్‌లు. వాస్తవానికి ఆమె స్టోర్ ఓపెనింగ్‌కు వెళుతున్న వాహనంపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని రాసి ఉంది. అంతే, వైసీపీ వాళ్లకి కూడా మంచి ఛాన్స్ ఇచ్చినట్లయింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan)పై ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలు కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వ వాహనాలను ఇలా హీరోయిన్ల కోసం వినియోగించడం ఏమిటి? ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ టైమ్‌లో కూడా ఇలాగే వాహనాలు వాడారు అంటూ ఇష్టం వచ్చినట్లుగా పేలుతున్నారు.
అది ప్రభుత్వ వాహనమే అయి ఉండొచ్చు. కానీ, కొన్ని ప్రైవేట్ వాహనాలను కూడా ప్రభుత్వ పనులకు, అధికారులకు వినియోగిస్తుంటారు. ప్రభుత్వ అధికారులకు అవసరం ఉన్నప్పుడు ఆ వాహనాలు వాడుతుంటారు. అవసరం లేనప్పుడు.. ఆ వాహన యాజమాని ఎలాగైనా తిప్పుకోవచ్చు. అలా అని, ఆ వాహనాలను ప్రభుత్వాలే తిప్పుతున్నాయని అనుకుంటే.. పొరపాటే. ఇప్పుడదే పొరబాటు.. వైసీపీ అండ్ బ్యాచ్ నిధి అగర్వాల్ విషయంలోనూ చేశారు. ఆమె కోసం డిప్యూటీ సీఎం ఏదో కావాలని పంపించినట్లుగా లేనిపోని ప్రచారం చేస్తున్నారు. ఆపద అంటే ఇప్పటికీ తన జేబులో నుంచి సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ గురించి.. వారు ఎన్ని మాటలు అన్నా ఏం కాదనుకోండి. కాకపోతే.. ఇలాంటివి వేరే రకంగా మాట్లాడుకోవడానికి తావిస్తాయి. అందుకే హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అందులో..
Also Read- Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్‌తో భేటీలు.. టాలీవుడ్‌లో అసలేం జరుగుతుంది?
‘‘ఇటీవల భీమవరంలో జరిగిన స్టోర్ ప్రారంభోత్సవానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఆ కార్యక్రమం కోసం స్థానిక నిర్వాహకులు నాకు రవాణా ఏర్పాట్లు చేశారు, వారు ఏర్పాటు చేసిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినది అయి ఉండొచ్చు. కానీ, ఆ వాహనం కావాలని నేను కోరలేదు. ఈ విషయంలో నాకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఆ ఈవెంట్ ఆర్గనైజర్లే నాకు ఆ వాహనాన్ని సమకూర్చారు. కొన్ని పోర్టల్స్‌లో నాకోసం ప్రభుత్వమే ఆ వాహనాన్ని ఏర్పాటు చేసిందనేలా చదివాను. నేను ఆ వార్తలను ఖండిస్తున్నాను. ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఏ ప్రభుత్వ అధికారికి ఈ విషయంలో సంబంధం లేదు. నా అభిమానులను నేను ఎంతగానో గౌరవిస్తాను, ఎలాంటి తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా నిజం ఏమిటో స్పష్టం చేయడం నాకు చాలా ముఖ్యం. నిరంతరం నాకు ప్రేమ, మద్దతు అందిస్తున్న నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అని నిధి అగర్వాల్ ఈ లేఖలో పేర్కొంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
