Kingdom OTT Details
ఎంటర్‌టైన్మెంట్

Kingdom OTT: ఓటీటీలోకి ‘కింగ్‌డమ్’.. ఇంత త్వరగానా? స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Kingdom OTT: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) కాంబినేషన్‌లో వచ్చిన ‘కింగ్‌డమ్’ మూవీ (Kingdom Movie) ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి తీసుకురాబోతున్నారని, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ వార్తలు దర్శనమిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ‌కు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ చిత్రంగా ‘కింగ్‌డమ్’ పేరు వినబడుతుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొన్ని ఏరియాలలో లాస్ వచ్చినప్పటికీ, విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ప్రచారం జరుగుతుంది. నిర్మాత నాగవంశీ కూడా విజయ్ దేవరకొండ అభిమానులకు పెద్ద హిట్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందని పలు వేదికలపై తెలిపారు. అలాగే మొదటి రోజు సగానికి పైగా పెట్టిన పెట్టుబడి వచ్చేసినట్లుగా ఆయన ప్రకటించడంతో.. అంతా ఈ సినిమా హిట్ అనే లెక్కకు వచ్చేశారు.

Also Read- Telugu Film Producers: నిర్మాతలతో భేటీ అనంతరం కందుల దుర్గేష్ ఏం చెప్పారంటే..?

సరే సినిమా లెక్కల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడీ సినిమా అనుకున్నటైమ్ కంటే ముందే ఓటీటీలోకి వస్తుందట. అదీ కూడా విడుదలైన నాలుగు వారాలకే. వాస్తవానికి ఏ పెద్ద హీరో సినిమా అయినా.. విడుదలైన మినిమమ్ 6 నుంచి 8 వారాల లోపు ఓటీటీలో రిలీజ్ చేయడానికి లేదని కొన్ని రూల్స్ టాలీవుడ్‌లో ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు సినిమాలు ఆ రూల్‌ని పక్కన పెట్టేసి, నాలుగు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కొందరు స్టార్ హీరోల సినిమాలు కూడా ఇదే బాట పట్టాయి. ఇప్పుడదే బాటలో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కూడా నడుస్తుందని తాజాగా టాలీవుడ్‌లో నడుస్తున్న టాక్.

ఆ వివరాల ప్రకారం ఆగస్ట్ 29 నుంచి.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని అంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అవుతుందనేలా టాక్ నడుస్తుంది. మరోవైపు ఈ సినిమాలో ఓ పాటను కట్ చేశారనేలా ఇప్పటికే ఫ్యాన్స్, చిత్రయూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. ఆ లోటు తీర్చడంతో పాటు, మరికొన్ని సన్నివేశాలను కూడా ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘హృదయం లోపల’ సాంగ్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్ ఒకటి, హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలను ఈ ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేయనున్నారట. థియేటర్లలో సినిమా చూసిన వారికి కూడా ఈ యాడ్ చేసే సీన్లు ఓటీటీలో చూసేటప్పుడు ఫ్రెష్ ఫీల్ కలిగేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనేది తాజా అప్డేట్. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో..

Also Read- Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్‌తో భేటీలు.. టాలీవుడ్‌లో అసలేం జరుగుతుంది?

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!