Producers met Ap Minister Kandula Durgesh
ఎంటర్‌టైన్మెంట్

Telugu Film Producers: నిర్మాతలతో భేటీ అనంతరం కందుల దుర్గేష్ ఏం చెప్పారంటే..?

Telugu Film Producers: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతలతో (Tollywood Film Producers) జరిగిన భేటీపై, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ (Kandula Durgesh) మీడియాకు తెలియజేశారు. ఆ నిర్మాతలు ఎందుకు వచ్చిందీ, వారితో జరిగినే భేటీలో ఏం చర్చకు వచ్చిందీ ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమాకు ఇస్తున్న సహకారం, ఈ శాఖ తెలుగు సినిమా పరిశ్రమకు చేస్తున్న అభివృద్ధి గురించి.. తెలుగు సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్మాతలు వచ్చి అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైన అంశాలపై దృష్టి పెట్టాలనే దానిపై వారు చర్చించడం జరిగింది. దానితో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై, 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన వివిధ అంశాలపై, అభివృద్ధిపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో చర్చించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా వారు కోరడం జరిగింది.

అందులో భాగంగానే కొత్త సినిమాలకు సంబంధించి రిలీజ్ విషయాలను, షూటింగ్ విషయం గానీ, అలాగే ప్రత్యేకమైన ఒక పాలసీ తీసుకొచ్చే దానిపై కూడా చర్చించడం జరిగింది. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు, ఇవన్నీ కూడా వారితో సమగ్రంగా చర్చించి, విస్తతమైనటువంటి ఒక వేదిక మీద వాటి గురించి బాగా ఆలోచించి, ఒక సమగ్రమైన ఆలోచనతో ముందుకు రండి.. అలా వచ్చినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలతో సెప్టెంబర్ మొదటి లేదంటే రెండో వారంలో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో వారు వచ్చి, ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారో, దానితో పాటు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో చెప్పాలని కోరాం.

Also Read- Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్‌తో భేటీలు.. టాలీవుడ్‌లో అసలేం జరుగుతుంది?

ప్రస్తుతం షూటింగ్స్ అయితే ఏపీలో బాగానే జరుగుతున్నాయి. వాటితో పాటు మౌళిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్, రీ రికార్డింగ్ థియేటర్‌ల నిర్మాణం కానివ్వండి.. వీటికి సంబంధించి వారికున్న ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులతో చర్చించడానికి ఒక ప్రాతి పదికగా, మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. త్వరలోనే ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది.

నంది అవార్డుల గురించి, నంది నాటకోత్సవాల గురించి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఉపముఖ్యమంత్రి వర్యులు కూడా దీనిపై కొన్ని సూచనలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం నంది అవార్డుల పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అది ఏ రకంగా చేయాలనే దానిపై రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దానిపై కూడా విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. దీనిపై కూడా నిర్మాతలను ఆలోచించుకుని రమ్మని చెప్పాం. వారు తదుపరి మీటింగ్‌లో దీనిపై క్లారిటీ ఇస్తామని చెప్పారు.

Also Read- Mahavathar Narasimha: చరిత్ర సృష్టిస్తున్న ‘మహావతార్ నరసింహ’.. బాలీవుడ్ బడా హీరోలను వెనక్కినెట్టి..

తెలుగు సినిమా అనేది అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే. ఎక్కడైనా ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రమే కనుక.. అవార్డుల కార్యక్రమం రెండు రాష్ట్రాలు కలిసి చేయాలా? లేదంటే విడివిడిగా చేయాలా? అనే అంశంపై నిర్మాతలు భిన్నాభిప్రాయాలు తెలియజేశారు. వాటన్నింటిని మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళతాం. వారి ఆలోచనలు కూడా తీసుకుని ముందుకు వెళతామని తెలియజేస్తున్నాం.

పాలసీల గురించి చెప్పాలంటే.. ఇప్పుడు సినిమా అనేది బడ్జెట్ చుట్టూనే తిరుగుతుంది కనుక.. పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ వంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. సినిమాకు సంబంధించిన విధాన రూపకల్పనలో బడ్జెట్‌ను ప్రధానాంశంగా తీసుకుని, ఏయే సినిమాలకు ఎలాంటి సహకారాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలనే దానిపై అన్యాపదేశంగా వారొక మాట చెప్పడం జరిగింది. దానిపై రాబోయే రోజుల్లో ఆలోచించి తొందరలోనే ఒక పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే వాటికి సహకారం లభించే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం..’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!