Kunamneni Sambasivarao
Politics

Kunamneniబీఆర్ఎస్ పాపం కాంగ్రెస్ కు శాపం: కూనంనేని

cpi state secretary Kunamneni Sambasiva rao criticised Modi :

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల విభజన హామీలు నెరవేర్చటంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కి పదవీకాంక్ష పీక్స్‌కు చేరిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు మారుస్తామని మోదీ చెప్పటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి ఎన్నికల కమిషన్ అంటే కూడా లెక్కలేకుండా పోయిందన్నారు. శ్రీరామనవమి కంటే ముందే శ్రీ రాముని అక్షంతలను పంపిణీ చేశారని, మోదీకి అధికార పిచ్చి పట్టిందని.. అధికారం కోసం దేశాన్ని ఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యారు… ఆయన పాపాలు ఇప్పటి ప్రభుత్వం మోస్తోందని… కొత్త ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలంటే అఖిలపక్షం మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.

కేంద్రం తెలంగాణకు చేసిందేమీ లేదు

వరికి రూ. 500 బోనస్ సన్న బియ్యానికే కాదు.. అన్ని రకాల బియ్యాలకు ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. జూన్ 2 తో రాష్ట్రం ఏర్పాటు అయ్యి 10 సంవత్సరాలు పూర్తి అవుతుందన్నారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయలేదు కధా కొత్త గా రాష్ట్రానికి చేసింది కూడా ఏమీ లేదు. రాష్ట్రానికే కాదు దేశానికే ఏమీ చెయ్యకుండా అబద్ధపు వాగ్దానాలు చేశారు . ఈ 10 ఏళ్లూ ఏమీ చేయకుండా ఎమోషన్స్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగo మార్చుతాము అంటున్నారు ఎన్నికల సంఘానికి మోదీ మీద చర్యలు తీసుకొనే ధైర్యం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది దాకా కాంగ్రెస్ లోకి వెళతారని కిషన్ రెడ్డి అంటున్నారు..అంటే బీజేపీ వాళ్లు తాము గెలుస్తామని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని కామెంట్ చేశారు. కొత్తగా ఏర్పడిక కాంగ్రెస్ ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా చేసిన ఘనుడు కేసీఆర్ అన్నారు. సామాన్య జనాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ధరణి. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ధరణి సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు. అలాగే సన్న బియ్యం సంబంధించి 500 బోనస్ ఇస్తాము అని అన్నారు దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాము. మిగితా రైతుల ను కూడా రేవంత్ సర్కార్ ఆదుకోవాలి అన్నారు. ఈ ఎన్నికలలో ఎన్టీయే కూటమికి ఓటమి తథ్యం అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు కూనంనేని సాంబశివరావు.

Just In

01

Cyclone Montha: మొంథా అంటే అర్థం ఏమిటి? ఈ పదాన్ని ఎవరు సూచించారో తెలుసా?

Bhatti Vikramarka: విద్యుత్ ప్రమాదాలకు చెక్.. రూ.27.76 కోట్లతో ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

CYCLONE MONTHA: మరికొన్ని గంటల్లోనే ‘మొంథా తుపాను’ బీభత్సం.. ఈ ఏరియాల్లో ఉండేవారికి బిగ్ అలర్ట్

Jubliee Hills Bypoll: జూబ్లీలో పోలింగ్ పెంచేందుకు కొత్త ప్లాన్.. రంగంలోకి యూసీడీ, స్వయం సహాయక బృందాలు!

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!