nassjatara( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara Teaser: ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేసింది.. చూశారా..

Mass Jathara Teaser: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ టాలీవుడ్ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు ‘సామజవరగమన’ చిత్రానికి కథ రచయితగా పనిచేసిన భాను, ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, ఈ జోడీపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.‘మాస్ జాతర’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read also- Pak Army Chief: వాళ్ల జోలికెళ్తే.. సగం ప్రపంచాన్ని లేపేస్తారట.. పాక్‌కు అంత సీన్ ఉందా?

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రవితేజ ఇటీవల డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారని సమాచారం. ఈ సినిమా కథాంశం విషయానికొస్తే, ‘మాస్ జాతర’ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఒక ప్రాంతంలో ప్రజలను ఇబ్బంది పెట్టే ఓ వ్యక్తి నుంచి వారిని కాపాడేందుకు రవితేజ ఏం చేస్తాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా కథ రూపొందినట్లు సమాచారం. ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉంటాయని అంచనా. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘తూ మేరా లవర్’, ‘ఓలే ఓలే’ పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి.

Read also- War 2 booking: ‘వార్ 2’ అడ్వాన్స్ బుకింగ్ సంచలనం.. ఒక్కరోజులో..

‘మాస్ జాతర’ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే.. రవితేజ ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ అందులో కనిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఊర మాస్‌ను తలిపిస్తున్నాయి. ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఇందులో రవితేజ ను ఉద్దేశిస్తూ.. ఆయన డిపార్టెమెంట్లో తప్ప అన్ని డిపార్టమెంటుల్లోనూ వేలుపెడుతూ ఉంటాడు. అనే డైలాగు బాగా ఆకట్టుకుంది. శ్రీలీల రవితేజ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు టాప్ నాచ్ లో ఉన్నాయి. కామెడీ టైమింగ్స్ కూడా బాగా కుదిరాయి. ఈ టీజర్ ను చూస్తుంటే రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయ మంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!