rana daggubati(inage:X)
ఎంటర్‌టైన్మెంట్

Rana Daggubati: నేడు ఈడీ విచారణకు దగ్గుబాటి రానా.. ఈసారైనా వెళ్తారా!

Rana Daggubati: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్‌ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నుంచి నోటీసులు పంపింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సెలబ్రిటీలు. హీరో దగ్గుబాటి రానా జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, నటి మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నది. అయితే రానా దగ్గుబాటి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను హాజరుకాలేనని సమయం కోరారు. తనకు షూటింగ్ ఉన్నందున మరో రోజు విచారణకు హాజరవుతానని రానా ఈడీని అభ్యర్థించాడు. దీంతో రానా భయపడుతున్నాడనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా గట్టిగానే నడుస్తున్నది. హీరో అభ్యర్థనపై అధికారుల నుంచి స్పందన లభించింది. ఆగస్టు 11 తేదీన ఖచ్చితంగా హాజరు కావాలని ఈడీ తెలిపింది. దీంతో రానా ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.

Read also – MP Kishan Reddy: సీనియర్ సిటిజన్లకు ఉచితంగా చికిత్స.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఇక ముందు తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయబోనని, హానికరమైన వ్యాపారాల ప్రమోషన్ల విషయంలో దూరంగా ఉంటానని విచారణ అనంతరం ప్రకటించారు ప్రకాశ్ రాజ్. తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదని, తాను ప్రమోషన్ చేసింది గేమింగ్ యాప్ మాత్రమే అని, అన్ని అనుమతులు ఉన్న లీగల్ గా కొనసాగుతున్న గేమింగ్ యాప్ ప్రమోషన్ లో మాత్రమే పాల్గొన్నానని స్పష్టం చేశారు విజయ్ దేవరకొండ. ఈడీ ఎప్పుడు కోరినా విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు.

Read also – Aamir Khan: ఆమిర్ ఖాన్‌పై తమ్ముడు ఫైసల్ వ్యాఖ్యలు.. స్పందించిన కుటుంబం

విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్‌తో పాటు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల (Ananya Nagalla), ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi), యాంకర్ శ్యామల (Anchor Shyamala), యూట్యూబర్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ (Bhayya Sunny Yadav), లోకల్ బాయ్ నానిలతో పాటు మరికొందరిపై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్–సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ఆధారంగా, పీఎంఎల్ఏ కింద వీరిని ఈడీ విచారించనున్నది. ఇప్పుడు కొందరికే నోటీసులు ఇవ్వగా.. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చి ఈడీ విచారించనున్నది. ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అక్రమంగా డబ్బును తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాకుండా నోటీసుల అందుకున్న వారి బ్యాంకు లావాదేవీలు, వ్యాపార పెట్టుబడులు, ఈ బెట్టింగ్ యాప్‌లతో వారికి ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో విచారించనున్నారు. వారి ఆర్థిక మూలాలపై కూడా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్, జూదాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇది ఈ కేసులో దర్యాప్తుకు మరింత బలం చేకూర్చింది. కాగా, ఈ వరుస విచారణలు టాలీవుడ్‌లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నది. ఈడీ విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు