Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్ లైన్‌లో పడినట్టేనా? అంటే ‘కింగ్‌డమ్’ (Kingdom) రిజల్ట్ తర్వాత అవుననే చెప్పుకోవాలి. ‘కింగ్‌డమ్’ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఏమాత్రం లేకపోయినా, విజయ్ ఆ సినిమా చేశారు. ఇంకా ఆ సినిమాలో సత్యదేవ్ (Satyadev) పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నా కూడా విజయ్ దేవరకొండ.. ఓకే చేశారు. కారణం, హీరో ఎలివేషన్స్ కాదు కావాల్సింది.. హిట్ అని నమ్మాడు కాబట్టే.. అన్నింటికీ ఓకే చెప్పారు. ఆయన నమ్మకం నిజమైంది. చాలా కాలంగా ఆయనకు దూరంగా ఉన్న హిట్ ఈ సినిమాతో వచ్చిందనే చెప్పుకోవాలి. కొన్ని ఏరియాల్లో తప్పితే.. చాలా వరకు ‘కింగ్‌డమ్’ సేఫ్ ప్రాజెక్ట్‌గానే పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై కూడా క్రేజ్ ఏర్పడింది. వాస్తవానికి గౌతమ్ తిన్ననూరి మొదటి నుంచి స్టోరీ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయం తెలియంది కాదు. అందుకే విజయ్ ఆయనను నమ్మి, ఫాలో అయ్యారు. ఫలితంగా తన ఖాతాలో మంచి హిట్టే పడింది.
Also Read- Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్‌కు ‘మోస్ట్ డిజైరబుల్’ అవార్డ్.. ఎవరికి అంకితం ఇచ్చారంటే?
ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతిలో రెండు ప్రాజెక్ట్ ఉన్నాయి. అవి ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్‌తో పీరియడ్ సినిమా ఒకటి అయితే, దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చేయనున్న ‘రౌడీ జనార్థన్’ మరొకటి. ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. అదీ కూడా అలాంటిలాంటి దర్శకుడు కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడనేలా.. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, దాదాపు ఈ కాంబోలో మూవీ ఫిక్స్ అయినట్లుగానే టాక్ అయితే నడుస్తుంది. నిజంగా ఇది నిజమైతే మాత్రం.. అదిరిపోయే కాంబినేషన్ సెట్ అయినట్లుగానే భావించవచ్చు.
Also Read- Viral Polyandry: ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవడంపై తొలిసారి స్పందించిన అన్నదమ్ముళ్లు
అయితే హరీష్ శంకర్‌కి కూడా కొంతకాలం నుంచి సరైన హిట్ లేదు. దర్శకత్వం పరంగా ఆయనకు తిరుగులేదు కానీ, హరీష్‌కు కూడా ఇప్పుడు ఓ హిట్ కావాలి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో మళ్లీ హరీష్ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడని అంతా భావిస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే విజయ్ దేవరకొండతో సినిమా ఓకే అయినట్లుగా టాక్ నడుస్తుండటంతో.. ఈ కాంబినేషన్‌లో మూవీ అయితే పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లేదంటే దిల్ రాజు నిర్మించనున్నారట. ఆల్రెడీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ‘కింగ్‌డమ్’ చేయగా.. రవి కిరణ్ కోలా – విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక, హరీష్‌తో సినిమా అంటే, హీరో ఎలివేషన్స్, డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలియంది కాదు. ఆయన విజయ్ దేవరకొండతో సినిమా చేసేది నిజమే అయితే మాత్రం ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇవ్వడం తధ్యం అని అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు