Venkata Ramana Reddy: రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ రెండూ కలిసి పనిచేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Venkata Ramana Reddy) ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో రైతుల పరిస్థితి అద్వాన్నంగా తయారైందన్నారు. కష్ట నష్టాలకు ఓర్చి రైతులు వివిధ పంటల విత్తనాలు వేసుకున్నారు. వరి(Pady) నాట్లు వేశారని, యూరియా(Urea) కొరత పై రాష్ట్రం ఒక రకంగా కేంద్రం ఓ రకంగా మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్(Congres) బీజేపీ(BJP) లకు చెరి 8 ఎంపీ లను తెలంగాణ ఇచ్చినా రైతులకు ఒరిగింది ఏమీ లేదన్నారు.
మోటార్లు ఆన్ చేయడం లేదు
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Redy), బండి సంజయ్(Bandisajnjey) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి సెక్క్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారని, బీజేపీ నేతలు యూరియా ఇప్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడకుండా బీ ఆర్ఎస్ మీదనే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడి గడ్డ దగ్గర నీళ్లు వృధాగా పోతున్నా కన్నె పల్లి మోటార్లు ఆన్ చేయడం లేదు. బీజేపీ ఎందుకు నిలదీయదు? అన్నారు. బీజేపీ కాంగ్రెస్ లే కలిసి పని చేస్తున్నాయి .ప్రజల గురించి ఆ రెండు పార్టీలకు పట్టింపు లేదన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రి గా కాకుండా ఏమీ తెలియని వ్యక్తిగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి కేసీఆర్(KCR) ను బద్నామ్ చేయాలని కుట్ర పన్నారన్నారు.
Also Read: CM Revanth protest: పేరు బంధంతో పాటు పేగు బంధం తెంచుకుందాం: రేవంత్ రెడ్డి
అంతర్గత కలహాలతో కమిషన్ రిపోర్టు
రెండు పార్టీలు ఎన్ని పన్నాగాలు చేసినా కేసీఆర్(KCR) ఇమేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు అన్నారు. ఏం పథకాలు,ప్రాజెక్టులు తెచ్చారని తెలంగాణ(Telangana) ప్రజలు బీజేపీ ని నమ్ముతారన్నారు. వేలాది టీఎంసీ లు గోదావరి లో వృధాగా పోతున్నా కాంగ్రెస్(Congress) బీజేపీ(BJP) నేతలు పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. బీజేపీ అంతర్గత కలహాలతో కమిషన్ రిపోర్టు లో ఈటెల పేరు చేర్చారన్నారు. కమిషన్ రిపోర్టుతో ఒరిగేదేమి లేదన్నారు. కేసీఆర్(KCR) పై కాంగ్రెస్(Congress) బీజేపీ లు కక్ష గడుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఈ సమావేశంలో టీ సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: The Paradise Film: ‘ది ప్యారడైజ్’లో రెండు జడలతో నేచురల్ స్టార్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?