Mega Heroes at gym
ఎంటర్‌టైన్మెంట్

Mega Heroes: జిమ్‌లో మెగా హీరోలు.. ఫొటో వైరల్!

Mega Heroes: ప్రస్తుతం మెగా హీరోలు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడొక ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో? ఆ ఫొటోలో ఉన్న మ్యాటర్ ఏంటి? అని అనుకుంటున్నారా? పై పిక్ చూస్తే అర్థం కావడం లేదా… మ్యాటర్ ఏంటో? మెగా హీరోలైన గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan), మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ (Varun Tej), సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్‌ (Sai Durgha Tej).. ఈ ముగ్గురూ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. తమ తదుపరి సినిమాల కోసం వారు ముగ్గురూ జిమ్‌లో కష్టపడుతున్నారు. రామ్ చరణ్ జిమ్‌కు ఎక్కువ టైమ్ కేటాయిస్తాడనే విషయం తెలియంది కాదు. సినిమా కోసమే కాదు.. నార్మల్‌గా కూడా రామ్ చరణ్ జిమ్‌లో ఎక్కువగా కష్టపడుతుంటారు. అందుకే అలా బాడీని మెయింటైన్ చేయగలుగుతున్నారు.

Also Read- Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్‌కు ‘మోస్ట్ డిజైరబుల్’ అవార్డ్.. ఎవరికి అంకితం ఇచ్చారంటే?

ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ పీరియాడికల్‌ మూవీ ఇది. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ బీభత్సమైన స్పందనను రాబట్టుకుని సినిమాపై ఎక్కడా లేని హైప్‌కి కారణమైంది. ఈ సినిమా విజయం రామ్ చరణ్‌కి ఎంతో ఇంపార్టెంట్ కూడానా. ఇంతకు ముందు వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఆయన ఊహించని విధంగా రిజల్ట్‌ని అందుకుంది. అందుకే, ‘పెద్ది’ కోసం తన శక్తినంతా ధారపోస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత లేదంటే, శ్రీలీల ఇందులో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది.

ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఇండో – కొరియన్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన బాడీ బిల్డ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ సినిమా వరుణ్ తేజ్‌కు చాలా కీలకం. ఎందుకంటే, గత కొంతకాలంగా ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొన్ని సినిమాలైతే దారుణమైన రిజల్ట్‌ని అందుకున్నాయి. వైవిధ్యమైన చిత్రాలు ఎన్ని చేసినా, హిట్ కూడా ముఖ్యమని వరుణ్ తేజ్‌ చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. అందుకే ఈసారి రాబోయే చిత్రంతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాననే ధీమాలో ఆయన ఉన్నారు.

Also Read- Elumalai: సింగర్ మంగ్లీ అలా అడుగుతుంటే.. కాపాడకుండా ఉంటాడా!

‘విరూపాక్ష’ సంచలన విజయం తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ చేస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ సినిమా కోసం సాయి దుర్గా తేజ్ మేకోవర్ మాములుగా లేదు. కండలు తిరిగిన శరీరంతో సాయి తేజ్ ఇందులో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు రోహిత్ కె.పి. దర్శకుడు కాగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా ముగ్గురు హీరోల సినిమాల మేకోవర్‌కి ఇంపార్టెన్స్ ఉండటంతో ఇలా జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. ఫొటోకి పోజులిచ్చారు. ఇప్పుడీ పిక్ సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!