TG Tourism Policy: తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Redy) పేర్కొన్నారు. ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) తో కలిసి లక్డీకపూల్ లోని సదరన్ ట్రావెల్స్ ప్రాంతీన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి 15 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించిందన్నారు. తద్వారా పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సంవత్సరం మార్చి 17 నుండి అమలులోకి వచ్చిన 2025-2030 పర్యాటక రంగం పాలసీతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణా రాష్ట్రాన్ని టాప్ 5 లో ఉంచడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ఈ పాలసీలో భాగమని ఆయన తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన పర్యాటక స్థలాలలో మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం,జలపాతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు,వారసత్వంగా గుర్తింపు పొందిన ప్రాంతాలు,ఏకోటూరిజం కేంద్రాలు,వెల్నెస్ కేంద్రాలతో పాటు క్రాఫ్ట్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
Also Read: Ankita Singh: 15 నిముషాల ఆ పనికి 3 లక్షలు ఛార్జ్ చేస్తా.. హీరోయిన్ సంచలన కామెంట్స్
కృష్ణా నదులపై రివర్ బెస్ట్ టూరిజం
ఇవి గాక మరో 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు రూట్ మ్యాప్ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తెలంగాణాకు తలమానికంగా నిలిచిపోయేలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, పాటు ప్రాంతీయ రింగ్ రోడ్ల వెంట డ్రై పోర్టులు,గోదావరి, కృష్ణా నదులపై రివర్ బెస్ట్ టూరిజం, నగరాలలో వాటర్ ఫ్రంట్ హబ్ లు వంటి ప్రత్యేకతలతో కూడిన పర్యాటక కేంద్రాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
దేశీయ, అంతర్జాతీయ ట్రావెల్ సంస్థలు కుటుంబ సభ్యులతో నిర్వహించే యాత్రలకు తెలంగాణా రాష్ట్రం కేంద్రంగా నిలిచేలా పాలసి రూపొందించబడిందన్నారు. పర్యాటక కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను వివరించి ప్రపంచస్థాయిలో నిలబడేలా చేయడం ప్రభుత్వ సంకల్పమన్నారు.అందుకు గాను పతిష్టమైన పర్యాటక కార్యవర్గాన్ని నియమించి డెస్టినేషన్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.
Also Read: Kavitha – KTR: కేటీఆర్ దెయ్యాల జాబితాలో లేరంటూ కవిత స్పష్టీకరణ