TGSRTC: స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు విధించినట్లు టీజీ ఆర్టీసీ(TGSTC) సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. పండుగల రద్దీ కి అనుగుణంగా సాధారణ సర్వీసులకు అదనంగా కొన్ని స్పెషల్ బస్సులు(Special Bus) నడిపిస్తుంటామని, ఇలాంటి వాటిలో మాత్రమే అదనపు చార్జీలు ఉంటాయని సంస్థ వెల్లడించింది. సాధారణ సర్వీసుల్లో యథావిధిగా రేట్లు ఉంటాయని వివరించింది.
స్పెషల్ బస్సుల్లో టికెట్ ధర
రాఖీ పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రయాణికులకు రవాణాపరమైన అసౌకర్యం కలుగకుండా ప్రతి ఏడాది మాదిరిగానే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వ జీవో(GO) ప్రకారం రాఖీ పండుగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించినట్లు వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరలను సవరించినట్లు స్పష్టం చేసింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని ప్రకటించింది.
Also Read: Bandi Sanjay on Congress: బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం!
కనీస డీజిల్ ఖర్చులు
ఈ నెల 11వ తేదీ వరకు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఈ సవరణ చార్జీలు వర్తిస్తాయని, ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ (Diss Play)ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. వాస్తవానికి స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్లు సంస్థ గుర్తు చేసింది. ఈ జీవో ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను రాఖీ పండుగ సందర్బంగా సవరించాల్సి వచ్చినట్లు క్లారిటీ ఇచ్చింది.
Also Read: Guvvala Balaraju: నల్లమలలో బీజేపీ జెండా ఎగురవేస్తా: గువ్వల బాలరాజు