Telangana formation day congress Brs: పంతం..నీదా? నాదా?
Telengana formation day
Political News, Top Stories

Hyderabad:పంతం..నీదా? నాదా?

  • రాష్ట్ర ఆవిర్భవ వేడుకలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధం
  • అధికారహోదాలో కాంగ్రెస్, ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్
  • కొట్లాది తెలంగాన తెచ్చుకున్నామంటున్న బీఆర్ఎస్
  • సోనియా ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అంటున్న కాంగ్రెస్
  • ఆవిర్భవ వేడుకలకు ఇరు పార్టీలకూ ఆటంకంగా మారిన ఎన్నికల కోడ్
  • ఈసీ పర్మిషన్ కు అనుమతి కోరుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్
  • తొలిసారి ప్రతిపక్ష హోదాలో ఆవర్భవ వేడుకలు జరుపుతున్న బీఆర్ఎస్
  • పోటాపోటీగా ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్
  • కీలక అంశాల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లలో బీఆర్ఎస్

Telangana formation day celebrations compition between congress Brs:

కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తొలిసారి తమ ఆధ్వర్యంలో జరిపే రాష్ట్ర ఆవిర్భవ వేడుకలను ఎంతో వైభవంగా జరపాలని అనుకుంటోంది. గత పదేళ్లుగా యావత్ తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం చావు నోట్లో తల పెట్టి మరీ సాధించుకున్నానని గత పదేళ్లుగా సెంటిమెంట్ ను పోగేసుకున్న కేసీఆర్ కు ఈ ఆవిర్భవ వేడుకల ద్వారా ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్. అందుకే ఈ సారి గట్టిగానే సోనియా, రాహుల్ గాంధీ ల వలనే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేద్దామని భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్.

తెలంగాణ భవన్ లో నిర్వహణ ఏర్పాట్లు

అయితే అఫిషియల్ గా కాంగ్రెస్ జరుపుతున్న ఉత్సవాలకు ధీటుగా కేసీఆర్ గొప్పదనాన్ని ప్రజలలోకి మరింగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఒకవేళ పబ్లిక్ గా ఎన్నికల కమిషన్ ఒప్పుకోకుంటే తెలంగాణ భవన్ లో ధూం ధాంగా నైనా నిర్వహించుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్. అయితే తాము జరుపుకునే ఆవిర్భవ వేడుకల ద్వారా తెలంగాణ ప్రజానీకానికి స్పష్టమైన సంకేతం ఇవ్వాలని, అలాగే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే లా జరుపుకోవాలని, పార్టీకి పునర్వైభవం తెచ్చేలా జరగాలని బీఆర్ఎస్ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారని సమాచారం. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించే ఆ పార్టీ నేతలు.. అదే లెగసీని ఇలాగే కొనసాగించడానికి ప్రభుత్వం నిర్వహించే ప్రోగ్రామ్‌ను తలదన్నే రీతిలో నిర్వహించాలనే స్థాయిలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటోందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

అపోజిషన్ హోదాలో ఫస్ట్ టైమ్

తెలంగాణ ఆవిర్భవ వేడుకల నిర్వహణ పై ఇంకా బీఆర్ఎస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సీనియర్ నేతలు, జిల్లాల ఇన్ ఛార్జిల సూచనలు, సలహాలు తీసుకుని వేడుకలను జరిపించేందుకు బీఆర్ఎస్ సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వ ప్రోగ్రామ్‌గానే నిర్వహించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఫస్ట్ టైమ్ తెలంగాణ భవన్‌లో నిర్వహించడానికి సమాయత్తమవుతున్నది. కేసీఆర్‌ను తెలంగాణ తెచ్చిన హీరోగా నిలబెట్టాలనుకుంటున్నది. పదేండ్ల పాలనా ఫలాలను ప్రదర్శించడమే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఉద్యమానికి ఊపిరులూదిన ఘట్టాలన్నింటినీ ప్రజలకు తెలిసేలా ఫొటో ఎగ్జిబిషన్‌ను పెట్టి ప్రజల్లోకి బలమైన మెసేజ్‌ను తీసుకెళ్లాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.

కేసీఆర్ ఘనత చాటేలా

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అంటూ కాంగ్రెస్ బలంగా చెప్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర సాధనకు యావత్తు తెలంగాణ ప్రజలను ఉద్యమంలోకి దూకించి సోనియాగాంధీని ఒప్పిం చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పాలనుకుంటున్నది. టీఆర్ఎస్‌ను స్థాపించిన తర్వా త మంత్రి పదవులను, అధికారాన్ని ఉద్యమం కోసం త్యాగం చేసి రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్, గులాబీ లీడర్లు కృషి చేశా రని అప్పటి జ్ఞాపకాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల కు వివరించాలని భావిస్తున్నది. ఏ లక్ష్యం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలకు ఆచరణ రూపం ఇచ్చి పదేండ్లలో తెలంగాణను సంక్షేమ అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా కేసీఆర్ తన పాలనా చతురతతో తీర్చిదిద్దారనే అంశాన్ని కూడా నొక్కిచెప్పాలనుకుంటున్నది.

పోటాపోటీ వేడుకలు

రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్‌ పాత్ర మాత్రమే కాక సబ్బండ వర్ణాలు ఉద్యమంలోకి దూకాయని, 1200 మంది విద్యార్థులు, యువత, తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగం చేశారన్న అంశాన్ని అధికారిక ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయదల్చుకున్నది. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం పార్టీ నష్టపోయినా ప్రజల త్యాగాలు, ఆకాంక్షల మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నారని, ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే రాష్ట్రం ఏర్పడేదే కాదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కానీ కేసీఆర్ పదేండ్ల పాటు క్రెడిట్ కొట్టేసి ప్రజల ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను చిన్నచూపు చూశారని పేర్కొంటున్నది.

Just In

01

IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!

Hyderabad Police: నమ్మించి పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి.. బంగారు ఆభరణాలు చోరీ!

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..

Jupally Krishna Rao: బంగ్లాదేశ్ అవతరణకు కారణం అదే.. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని గుర్తుచేసిన జూపల్లి!

GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం.. పార్టీలకతీతంగా పునర్విభజనపై సభ్యుల ప్రశ్నల వర్షం!