maroka sari( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Maroka Saari First Look: ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌.. లొకేషన్స్ అదిరాయిగా..

Maroka Saari First Look: నరేష్ అగ‌స్త్య‌, సంజ‌నా సార‌థి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ ‘మరొక్కసారి’. ‘మత్తు వదలరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నరేష్ ఇప్పుడు ‘మరొక్కసారి’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సి.కె.ఫిల్మ్ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.చంద్ర‌కాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం నితిన్ లింగుట్ల. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కంప్లీట్ చేసుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను నిర్మాతలు విడుద‌ల చేశారు. అందులో ఫ్రెష్ లొకేషన్స్ ఆహ్లాదపరిచేలా ఉన్నాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని విడుదల చేసిన పోస్టర్ చూస్తే చెప్పవచ్చు.

Read also- War 2 film: ‘వార్ 2’ నిడివి ఇన్ని గంటలా?.. పెద్ద సినిమానే..

‘మరొక్కసారి’ మూవీకి భరత్ మాంచి రాజు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తంగా ఆరు పాటలుంటాయి. ఈ పాటను టాలీవుడ్ టాప్ సింగర్లు ఆలపించారు. ప్రముఖ గాయకులు కార్తిక్, ప్రదీప్ కుమార్, దేవన్ ఏకాంబరం, జాస్సీ గిఫ్ట్ వంటి వారు పాటల్ని పాడారు. ఇప్పటికే పాటలకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. అందమైన ప్రేమ కథా చిత్రానికి విజువల్స్ మరింత అందాన్ని తీసుకు రాబోతోన్నాయి. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా కూడా షూటింగ్ చేయనటువంటి గురుడోంగ్మార్ లేక్ వంటి ప్రదేశంలో ఈ ‘మరొక్కసారి’ చిత్రీకరణ జరుపుకుంది.

Read also- Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో కూలిపోయిన పాకిస్థాన్ విమానాల సంఖ్యను ప్రకటించిన భారత్

5,430 మీటర్ల ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్‌ దగ్గర షూటింగ్ చేసిన ఏకైక, ఇండియన్ మూవీగా ‘మరొక్కసారి’ నిలిచింది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఓ ఆహ్లాదకరమైన ప్రేమ కథను చూడబోతోన్నామని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సంజనా, బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి తదితరులు నటించారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా రోహిత్ బచు, సంగీత దర్శకుడిగా భరత్ మాంచిరాజు, ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్ పని చేస్తున్నారు.

Just In

01

School Holidays: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడురోజులు సెలవులు

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?