500 Women Tied Rakhi: అక్కా, తమ్ముళ్ల అన్నా చెల్లెలు మధ్య ఆత్మీయ బంధానికి చిహ్నంగా నిర్వహించుకునే పండగ రక్షాబంధన్ రక్త సంబంధీకులు లేకున్నా.. మన కోసం అండగా నిలిచే ఆప్తుల్ని సమాజం అందిస్తుంది. అలాంటి వారికి రాఖీ కట్టి సోదర భావాన్ని పెంపొదించుకోవడానికి రాఖీ పౌర్ణమి మంచి సందర్భం. సోదరుడంటే తోడ బుట్టిన వాడే కానక్కర్లేదు..చెల్లెమ్మా.. నేనున్నానంటూ రక్షగా నిలిచే ప్రతి ఒక్కరూ సోదర సమానులే. అందుకే వారి అనుబంధానికి ప్రతీకగా శ్రావణమాసంలో పౌర్ణమి నాడు రక్షాబంధన్ (రాఖీ) పండగ ను జరుపుకుంటారు. అటువంటీ రక్షా బంధన్ వేడుక కి నిజమైన అర్ధం చెప్పారు. కేసముద్రం మండల మహిళా సోదరీమణులు. “నేను అనాధ ను నాకు ఎవరు లేరు” అనే సందర్భంలో మేము వున్నాం.. అన్న నీకు అంటూ రక్షా బంధన్ తో ఆ అన్న కి రక్ష గా నిలబడి నిజమైన తోబుట్టువులు కూడా చూపని ప్రేమను ఆదరణ ను చూపారు. కేసముద్రం మహిళా మణులు.
Also Read: 3000 Year Old Skeletons: 3000 ఏళ్ల క్రితం జరిగిన బలిదానాలు.. బయటపడ్డ 14 అస్థిపంజరాలు.. ఎక్కడంటే?
సమ్మిగౌడ్ ఫౌండేషన్ సమ్మయ్యకు ఆడబిడ్డల “రక్షా”..బంధన్’
సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ చిలువేరు సమ్మయ్య గౌడ్ కేసముద్రం మండలంలో ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకు లా, ఆడపడుచులకి అన్న లా, ఏ కష్టం వచ్చిన రెక్కలు కట్టుకొని వాలిపోయి వారికి అండగా నిలిచి నేనున్నానంటూ ధైర్యం నింపుతారు. అలాంటి అన్న కష్టాల్లో మేము ఉండలేమా..? అని “రక్ష” బంధన్ కట్టి మరింత సోదర బంధాన్ని ఇచ్చి ఆనంద భాష్పాలు నింపారు. కేసముద్రం మండల కేంద్రంలో రక్షా బంధన్ వేడుకల్లో చిలువేరు సమ్మయ్య గౌడ్ కి మండలం లోని వివిధ గ్రామాల నుంచి సుమారు 500 మంది మహిళలు రాఖీలు కట్టి నీవు మాకు రక్షా… మేము నీకు రక్షా అనే దానికి సరైన బాష్యం చెప్పారు. వారి ప్రేమానురాగాలకి మాటలు రాక చిలువేరు కన్నీటి పర్యంతమై.. నా జన్మoతా మీకు రుణపడి ఉంటానని అండగా నిలబడుతున్న ఆడబిడ్డల పాదాలకు ప్రణమిల్లి ఆశీర్వాద రక్షా ఇచ్చారు.