Mahesh Babu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

SSMB 29: బర్త్ డే స్పెషల్.. మహేష్ బాబు ఫస్ట్ లుక్ వచ్చేసింది..

SSMB 29: బర్త్ డే స్పెషల్.. మహేష్ బాబు ఫస్ట్ లుక్ వచ్చేసింది..

ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడా అని వెయిట్ చేశారు. అయితే, అందరికీ బిగ్ షాకిస్తూ మహేష్ బాబుతో SSMB29 ను అనౌన్స్ చేశాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా కోసం అభిమానుల హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9, 2025) సందర్భంగా రాజమౌళి ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Also Read: Kantara – Chandramukhi: నిద్రలేచిన చంద్రముఖి.. కాంతార టీమ్‌ను వెంటాడుతున్న మృత్యువు.. రెండింటికి లింకేంటి?

రాజమౌళి ఎక్స్ లో ఏం పెట్టాడంటే?

నవంబర్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని బిగ్ అప్డేట్ ఇచ్చాడు. రాజమౌళి తన X ఖాతాలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ బాంబ్ విసిరాడు. SSMB29 ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్‌లో వస్తుందని ప్రకటించాడు. అంతే కాదు, మహేష్‌ను “గ్లోబ్‌ట్రోటర్” గా చెబుతూ ఓ టీజర్ లుక్‌ను కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో మహేష్ మెడ భాగం మాత్రమే కనిపిస్తోంది. రుద్రాక్ష మాల, చుట్టూ రక్తపు మరకలు, రగ్గడ్ బ్యాక్‌గ్రౌండ్‌తో కనిపించాడు. ఈ లుక్ అభిమానుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తుంది. ఈ ఒక్క ఇమేజ్‌తోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Also Read:  3000 Year Old Skeletons: 3000 ఏళ్ల క్రితం జరిగిన బలిదానాలు.. బయటపడ్డ 14 అస్థిపంజరాలు.. ఎక్కడంటే?

ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

రాజమౌళి అప్‌డేట్‌తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎక్స్ లో “#SSMB29”, “#HBDMaheshBabu” హ్యాష్‌ట్యాగ్‌లతో కామెంట్స్ వరదలా పొంగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం సార్, మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగే, అలాగే ఉన్నాడు. “మహేష్ లుక్ ఫైర్”, “రాజమౌళి- మహేష్ కాంబో అదిరింది. బ్లాక్‌బస్టర్ లోడింగ్!” అంటూ ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ టీజర్ లుక్‌లోని రుద్రాక్ష, రక్తం మరకలు సినిమా ఇంటెన్స్ థీమ్‌ను సూచిస్తుంది. ఇది గ్లోబల్ అడ్వెంచర్ లేదా యాక్షన్ డ్రామా కావచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: Akhanda 2 Update: అఖండ 2: తాండవం- డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదేలే..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!